
Shruti Haasan Rashmika Mandanna:న్యూ ఇయర్ గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటే, సినీ అభిమానులు మాత్రం సంక్రాంతికి సందడి చేసే వారి మీద వీర ఫోకస్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొస్తున్న ఏకైక లేడీ శ్రుతిహాసన్. ఇటు చిరంజీవి పక్కన వాల్తేరు వీరయ్యలోనూ, అటు బాలకృష్ణ పక్కన వీరసింహారెడ్డిలోనూ నటిస్తున్నారు. శ్రుతిహాసన్ మాత్రమే కాదు పోటీలో నేషనల్ క్రష్ రష్మిక కూడా ఉన్నారు. విజయ్ సరసన ఆమె వారిసులో నాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే రంజితమే పాటతో తమిళనాడులో పాపులర్ అయ్యారు. తెలుగులో వారిసు వారసుడుగా రిలీజ్ అవుతోంది. అయితే ఇక్కడ ఆ సినిమాను డబ్బింగ్ సినిమాగానే చూస్తున్నారు. సో ఫోకస్ రష్మిక మీద కూడా పెద్దగా లేదు. ఆమెతో పోలిస్తే అసలు రేస్‌లో ఉన్నా తునివు హీరోయిన్ మంజువారియర్‌ని అసలు పట్టించుకునేవారే లేరు.
తునివులో ఓ పాట కూడా పాడారు మంజు వారియర్. ఇటు తెలుగులో కూడా మరో ఇద్దరు హీరోయిన్లు సంక్రాంతి రేసులో ఉన్నా పట్టించుకోవడం లేదు జనాలు. వాల్తేరు వీరయ్యలో రవితేజ పక్కన నటిస్తున్నారు కేథరిన్ ట్రెస్సా. అటు వీరసింహారెడ్డిలో కీ రోల్ చేస్తున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. పండక్కి పలకరించడానికి వీరిద్దరూ వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది కేథరిన్ ట్రెస్సా కి బింబిసారలాంటి సూపర్‌డూపర్ హిట్ సినిమా ఉంది. అటు వరలక్ష్మీ శరత్‌కుమార్‌కి కూడా యశోదలాంటి బంపర్‌హిట్ మూవీ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ సీజన్ సంక్రాంతికి పోటాపోటీగా బరిలోకి దూసుకొస్తున్నారు.
దీన్ని బట్టి చూస్తే ఈ సంక్రాంతికి శ్రుతికి గట్టిపోటీ ఇవ్వడానికి రష్మిక, వరలక్ష్మీ శరత్‌కుమార్, కేథరిన్ ట్రెస్సా, మంజువారియర్‌లాంటి వారందరూ రెడీ అవుతున్నారన్నమాట.