Puri Sethupathi : ప్రస్తుతం వరుస డిజాస్టర్ తో సతమతం అవుతున్నాడు కానీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ల ప్రస్తావన వస్తే మొదటి వినిపించే పేరు పూరి జగన్నాథ్. బద్రి సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన పూరి తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్నాడు. పూరి సినిమా అంటే హీరో క్యారెక్టర్రైజేషన్స్ చాలా బాగుంటాయి అని అందరికీ తెలిసిన విషయమే. ఒక మామూలు కథని కూడా హీరో క్యారెక్టర్రైజేషన్ తో అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా చేస్తాడు. అందుకే పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలు చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు. హీరోయిన్లను అగౌరవంగా హీరోలు పలకరిస్తారు అని చెబుతుంటారు. కానీ పూరి సినిమాల్లో హీరోయిన్ ఖాళీగా లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉంటుంది.
పూరి సేతుపతి పై అంచనాలు
లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ పని అయిపోయిందని దాదాపు అందరూ అనుకున్నారు. అయితే అప్పటికే రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ అనౌన్స్ చేస్తూ డబుల్ ఇస్మార్ట్ సినిమా చేశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ఈసారి పూర్తిగా లోపలికి వెళ్ళిపోయారు అనుకునే తరుణంలో విజయ్ సేతుపతి హీరోగా సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మామూలుగా విజయ్ సేతుపతి ఎటువంటి సినిమాలు ఎంచుకుంటారు అందరికీ ఒక క్లారిటీ ఉంది. కథను విజయసేతుపతి ఒప్పుకున్నారు అంటే ఖచ్చితంగా పూరి మంచి కథను రాశాడు అని అందరికీ ఒక నమ్మకం ఉంది.
భారీ స్టార్ కాస్ట్
ఈ సినిమాలో విజయ్ సేతుపతి తర్వాత ఒక్కొక్క యాక్టర్ ను అనౌన్స్ చేస్తుంది చిత్ర యూనిట్. ఇదివరకే సినిమాల్లో టబు నటిస్తారని అధికారికంగా ప్రకటించారు. అలానే నివేదా థామస్ ఒక కీలకపాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా సార్ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంయుక్తమైన ఈ సినిమాలో పార్ట్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి భవతి భిక్షాందేహి అని టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఏదైనా ఈ సినిమాతో పూరి ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు అని చాలామంది ఆశిస్తున్నారు. వీరందరితోపాటు పూరి కుమారుడు ఆకాష్ పూరి కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు అని సమాచారం ఉంది. దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రాలేదు.
Grace in her stride. Fire in her eyes.
Welcoming the stunning @iamsamyuktha_ on board into the electrifying world of #PuriSethupathi ❤️🔥❤️🔥❤️🔥
A #PuriJagannadh film
Starring Makkalselvan @VijaySethuOffl, #Tabu, and @OfficialVijiProduced by Puri Jagannadh & @Charmmeofficial under… pic.twitter.com/RzlZMBs4DJ
— Puri Connects (@PuriConnects) June 17, 2025