Salaar 1st day collections : గత కొద్ది నెలలుగా ఇండియా వైడ్ బాగా వైరల్ అవుతున్న మూవీ సలార్ .ఎట్టకేలకు నిన్న ‘సలార్: సీజ్‌ఫైర్’ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. మొదటి షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ మేనియా కనిపిస్తుంది. హైప్ కు తగ్గట్లుగానే మూవీ భారీ స్థాయిలో స్పందన అందుకుంటోంది.
ప్రశాంత్ నీల్ ..ప్రభాస్ కాంబోలో తరికెక్కిన సలార్ చిత్రం పార్ట్ 1 సీజ్ ఫైర్ భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల అయింది.హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించిన ఈ సినిమా కు రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలు పోషించారు. శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించారు.
ఇక మూవీకి సంబంధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే..
నైజాం రూ. 60 కోట్లు, సీడెడ్ రూ. 24 కోట్లు, ఆంధ్ర రూ. 60 కోట్లు..మొత్తం కలిపి 120 కోట్లు బిజినెస్ అయింది. ఇక కర్నాటకలో 30 కోట్లు ,తమిళనాడులో 12 కోట్లు, కేరళ లో 6 కోట్లు, హిందీ లో 75 కోట్లు..రెస్ట్ అఫ్ ఇండియా అంతా కలిపి 3 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తానికి 345 కోట్లు వ్యాపారం జరిగింది.
ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ కి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది.దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్ష్పెక్టేషన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగానే వచ్చాయి.ఈ నేపథ్యంలో ‘సలార్: సీజ్‌ఫైర్’ కు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయి అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా కరెక్ట్ అయింది.ఈ చిత్రం మొదటి రోజు తెలుగులో రూ. 45 – 50 కోట్లు,వరల్డ్ వైడ్‌గా రూ. 75 – 80 కోట్లు షేర్స్ వసూలు చేసింది.వరల్డ్ వైడ్‌గా రూ. 75 – 80 కోట్లు షేర్ వసూలు అయినట్లు టాక్. అంటే ఈ మూవీ
ఏకంగా రూ. 155 – 160 కోట్లు గ్రాస్‌ను రాబట్టి 2023లో టాప్ మూవీ గా రికార్డును సృష్టించింది.