BigTV English

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. 28 నుంచి ప్రక్రియ ప్రారంభం

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. 28 నుంచి ప్రక్రియ ప్రారంభం

New Ration Cards: కొత్త రేషన్‌ కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు ఒకసారి మాత్రమే నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రక్రియ గత ప్రభుత్వం చేపట్టలేదు. కేవలం కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దిశగా కూడా ఎలాంటి ప్రక్రియకు ముందడుగు పడలేదు.


నూతన రేషన్‌ కార్డుల అప్లికేషన్లను మీసేవా ద్వారా ఆన్‌లైన్‌లో తీసుకుంటారు. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్‌ చేశాక ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేస్తారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామసభలు.. నగరాలు, పట్టణాల్లో బస్తీసభల ద్వారా జరుగుతుంది. ఈ ప్రాసెస్‌ చూడటం కోసం ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను ప్రభుత్వం నియమించనుంది.

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. కేవలం రేషన్‌ కోసమే కాకుండా.. ఆ కార్డు ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు మ్యాండేటరీగా ఉంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. అర్హత కలిగినప్పటికీ అనేక కుటుంబాలు రేషన్‌ కార్డుల్లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందలేకపోతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 6 లక్షల 47 వేల 297 రేషన్‌కార్డులు జారీచేసింది గత ప్రభుత్వం. రాష్ట్రంలో ఇంతవరకు మొత్తం 2.82 కోట్ల మందికి పైగా రేషన్‌ లబ్ధిదారులు ఉన్నారు.


రేషన్‌ కార్డుల జారీకి అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉంది. గతంలో ఉన్న మార్గదర్శకాలే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు.. తప్పులను సరిచేయడానికి సైతం ఈనెల 28వ తేదీ నుంచి అవకాశం కల్పించనున్నారు. శాసనసభ ఎన్నికల ముందు నాటికే ఈ జాబితాలో 11.02 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు చేర్చాలని దరఖాస్తుదారులు కోరారు. ఎడిట్‌ ఆప్షన్‌ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియ ఇన్నాళ్లూ ముందుకు సాగలేదు.

రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. కొత్త కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని చేర్చేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 11.02 లక్షల దరఖాస్తులకు సంబంధించి 15.87 లక్షల మంది పేర్లను ఆహారభద్రత కార్డుల్లో చేరాలని ఇప్పటికే దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×