BigTV English

Salar trailer 2 : భారీ యాక్షన్ సీక్వెన్స్.. సాలిడ్ గా సలార్ ట్రైలర్ 2..

Salar trailer 2 : భారీ యాక్షన్ సీక్వెన్స్.. సాలిడ్ గా సలార్ ట్రైలర్ 2..
Salar trailer 2

Salar trailer 2 : ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన చిత్రం సలార్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ,ట్రైలర్, పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకోవడంతోపాటు చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభించేశారు ప్రభాస్ అభిమానులు. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో మాత్రం డార్లింగ్ అభిమానులు కాస్త నిరాశ కనబరిస్తున్నారు. ప్రభాస్ రేంజ్ కు తగినట్లుగా ప్రమోషన్స్ చేయడం లేదు అనేది వాళ్ళ అభిప్రాయం.


మూవీ నుంచి విడుదలైన సాంగ్.. మంచి ఎమోషనల్ కంటెంట్ తో హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంది. ఇక ఈ మూవీకి సంబంధించి సెకండ్ ట్రైలర్.. సోమవారం ఉదయం రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ అది మధ్యాహ్నానికి వాయిదా పడడంతో ప్రభాస్ అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం అన్నా విడుదల అవుతుందా లేక అది కూడా పోస్ట్ పోన్ అవుతుందా అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ లేట్ అయింది అని కోపంగా ప్రశాంత్ నీల్ వైఫ్ పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అయింది.మొత్తానికి ప్రభాస్ సలార్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు.

మొదటి ట్రైలర్ హీరోకి.. అతని ఫ్రెండుకి మధ్య ఉన్న బాండింగ్ ని హైలైట్ చేస్తూ.. యాక్షన్ తో పాటు ఎమోషనల్ టచ్ ని కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ట్రైలర్ మాత్రం కంప్లీట్ యాక్షన్ కట్ అవుట్ తో విడుదల చేశారు. ఒక సాధారణ మెకానిక్ గా ఉన్న దేవా.. అతని ఫ్రెండ్ కోసం ఓ పెద్ద సామ్రాజ్యంలో పనివాడిగా చొరబడి.. విధ్వంసం సృష్టిస్తాడు. స్టోరీలో ట్విస్టులు చాలా ఉన్నాయి అన్న విషయాన్ని సెకండ్ ట్రైలర్ తో చెప్పకనే చెప్పారు మేకర్స్.


ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. కానీ మొదటి ట్రైలర్ లో ఎక్కడ ఆమె జాడ కూడా కనిపించలేదు. పోనీ ఈ ట్రైలర్ లో శృతిహాసన్ కి సంబంధించి మంచి కంటెంట్ చూపిస్తారు అనుకున్న వారిని నిరాశపరుస్తూ ఈ ట్రైలర్ లో శృతి మెరుపు తీగలా ఒకే ఒక డైలాగ్ తో అలా మెరిసి వెళ్లిపోయింది. మొత్తానికి ట్రైలర్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉంది. లేటుగా వదిలినా .. సాలిడ్ కంటెంట్ తో బాక్సాఫీస్ బద్దలయ్య సౌండ్ తో.. సలార్ ట్రైలర్ 2 సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీ విడుదల తర్వాత ఏ రేంజ్ రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×