Prabhas – OG Movie: సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఓ జి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం డైరెక్టర్ సుజిత్ స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని కావడం. జానీ సినిమా తర్వాత దాదాపు పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కి హిట్ సినిమా లేనప్పుడు గబ్బర్ సింగ్ సినిమా పడింది. ఆ సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఒక రీమేక్ సినిమాతో కూడా రికార్డ్స్ సృష్టించాడు. ఒక సగటు పవన్ కళ్యాణ్ అభిమాని కళ్యాణ్ ను ఎలా చూడాలనుకుంటాడు అలా చూపించాడు. ఆ సినిమాలో రాసిన ప్రతి డైలాగ్ కూడా పవన్ కళ్యాణ్ ఒరిజినల్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అలానే పవన్ కళ్యాణ్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని కంప్లీట్ గా బయటకు తీశాడు. సినిమా ఫస్ట్ షో పడగానే టాక్ పాజిటివ్ గా వచ్చి కలెక్షన్స్ కు కొత్త దారి చూపించింది. ఆ టైంలో పబ్లిక్ రెస్పాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. అలా పబ్లిక్ రివ్యూ లో హైలెట్ అయిన వారిలో సుజిత్ ఒకరు. ఇప్పుడు ఆ సుజిత్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేస్తున్నాడు.
ఇదివరకే ఓ జి కు సంబంధించిన గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. ఈ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం ఒక హై తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. వాస్తవానికి ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలన్నిటి కంటే కూడా ఎక్కువ హైపు ఉంది ఈ సినిమా పైన. ఇక సుజిత్ విషయానికొస్తే రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి పేరును సాధించుకున్నాడు సుజిత్. ఇక రెండవ సినిమా సాహో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఊహించిన సక్సెస్ సాధించక పోయినా కూడా, దర్శకుడిగా సుజిత్ కి మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది.
అయితే పవన్ కళ్యాణ్ తో సుజిత్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే సాహో సినిమా మీద కూడా పాజిటివ్ రివ్యూస్ మొదలయ్యాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓ జి సినిమాలో ప్రభాస్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ నటించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అవాస్తవం అని కొట్టి పడేయడానికి కూడా లేదు. ఎందుకంటే సుజిత్ కి ప్రభాస్ కి మధ్య మంచి బాండింగ్ ఉంది. నిజంగా సినిమాలో ఒక కీలకమైన పాత్రను సుజిత్ క్రియేట్ చేస్తే కచ్చితంగా ప్రభాస్ చేసే అవకాశం కూడా ఉంది. అసలు సుజిత్ లో టాలెంట్ ను మొదటి కనిపెట్టి సినిమాల్లో రావడానికి తోడ్పడింది ప్రభాస్. రన్ రాజా రన్ సినిమాకి అవకాశం కూడా ఒకరకంగా ప్రభాస్ వాళ్ళనే వచ్చింది. ఆ బాండింగ్ తోనే ఈ కాంబినేషన్ ను సుజిత్ సెట్ చేశాడు అనుకోవచ్చు.
Also Read : Vivek Athreya To Hasith Goli : డైరెక్టర్ వెర్షన్ కంటే ఆడియన్స్ వెర్షనే చాలా బాగుంది