Nandamuri Mokshagna : సినీ ఇండస్ట్రీలో వారసుల రాక కామన్.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంత మంది స్టార్స్ టాలెంట్ తో బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. మరికొందరు మాత్రం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఒక్క హిట్ సినిమా కూడా పడటం లేదని బాధపడుతున్నారు. ఎప్పటికైనా హిట్ సినిమా తమ ఖాతాలో వేసుకుంటామని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి నటసింహం బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా త్వరలోనే అడుగుపెట్టానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.. ఇప్పుడు మరో డైరెక్టర్ మోక్షజ్ఞను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఎలాంటి కథతో మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..
నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు వచ్చిన హీరోలు అందరూ ప్రస్తుతం స్టార్ హీరోలు అయ్యారు. ఇప్పుడు నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఒక సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈయనను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రశాంత్ వర్మ ను సెట్ చేసిన బాలయ్య ఆ డైరెక్టర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇప్పుడు మరో డైరెక్టర్ కు ఆ ఛాన్స్ ఇచ్చారని ఓ వార్త అయితే ఫిలింనగర్ లో వినిపిస్తుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో సినిమా వస్తుంది కానీ అది మొదటి సినిమాగా కాకుండా రెండవ సినిమాగా రాబోతుందని టాక్.. మరి మొదటి సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. బాలయ్య డైరెక్టర్ నాగశ్విన్ చేత మోక్షజ్ఞను ఇండస్ట్రీలోకి లాంచ్ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ మూడు నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడంతో నాగ్ అశ్విన్ కు ఆ ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డైరెక్టర్ గతేడాది ప్రభాస్ తో కల్కి సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డులను సొంతం చేసుకుంది. మరి పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కే ఈ సినిమాతో మోక్షజ్ఞ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాడు. తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.. మంచి అవకాశాన్ని ప్రశాంత్ వర్మ చేజేతులారా పోగొట్టుకున్నారని ఇండస్ట్రీలో వార్త కోడై కూస్తుంది. సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేయకపోవడంతో బాలయ్య బాబు తీవ్రమైన కోపానికి వచ్చాడట. అందువల్లే తన సినిమాని క్యాన్సిల్ చేయకుండా రెండో సినిమాగా చేయాలని మొదటి సినిమాను వేరే దర్శకుడు తో చేయిస్తానని బాలయ్య చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్.. నిజానికి ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను ఏడాది థియేటర్లలోకి తీసుకురావాలి కానీ ఇప్పటివరకు ఆ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ రాలేదు అలాగే మరో మూడు సినిమాలను ఒప్పుకున్నాడు ఆ సినిమాల నుంచి కూడా ఎటువంటి అప్డేట్స్ను రిలీజ్ చేయలేదు దానితో ఫాన్స్ ఇంతకీ ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నారని ఆలోచనలో ఉన్నారు. ఏది ఏమైనా ఏడాది చివర్లో కల్లా ప్రశాంత్ వర్మ సినిమా ఒకటి రిలీజ్ అయితే ఆ డైరెక్టర్కు మంచి ఫ్యూచర్ ఉంటుంది లేదంటే మాత్రం ఇక సినిమాల కోసం వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.