BigTV English
Advertisement

The Raja Saab: ఫ్యాన్స్ ను నిరాశపరిచిన ప్రభాస్.. ఏమైందంటే..?

The Raja Saab: ఫ్యాన్స్ ను నిరాశపరిచిన ప్రభాస్.. ఏమైందంటే..?

The Raja Saab..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతున్న రెబెల్ స్టార్ ప్రభాస్(Prabhas ) వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ.. జెడ్ స్పీడులో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ‘కల్కి 2898AD’ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు మారుతి(Maruthi ) డైరెక్షన్లో ‘ది రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఈ సమ్మర్ కి తప్పకుండా రిలీజ్ అవుతుందని, ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ప్రభాస్ తన అభిమానులను నిరాశపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా మేకర్స్ మాటలను బట్టి చూస్తే ఇప్పట్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని సమాచారం.


అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సమ్మర్ కి విడుదల పక్కా అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వెయిట్ చేయండి.. ఓపిక పట్టండి.. కంగారు పడకండి అనే మాటలు వినిపిస్తున్నాయి. మేకర్స్ జస్ట్ ఆ మాటలతోనే ఊరుకుంటున్నారా? లేకుంటే ఏదైనా హింట్ ఇస్తున్నారా? హాట్ సమ్మర్ లో థియేటర్లోకి కూల్ గా రాజా సాబ్ ఎంట్రీ ఇస్తారనుకున్న అభిమానులకు.. కూల్ గా సారీ చెప్పేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అంటూ వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నా.. అంతకుమించి ఊరించే మాటలు కూడా ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. అయితే తాజాగా కెప్టెన్ మారుతి కూడా.. ప్రస్తుతం ప్రభాస్ తో చేసే సినిమా ప్రేక్షకులకు నచ్చాలని, అలాంటి సినిమాని డార్లింగ్ తీస్తున్నారని, కంగారు పడకుండా ధైర్యంగా ఉంటే.. ది బెస్ట్ అవుట్ పుట్ వస్తుందని మారుతి చెప్పారు. అటు మాళవిక కూడా మాట్లాడారు. ప్రభాస్ చాలా స్వీట్ అంటూ చెప్పింది. దీనికి తోడు థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా పాతదైపోయింది. అందుకే ఫ్రెష్ గా మళ్ళీ ట్యూన్స్ కడుతున్నాను అని తమన్ తెలిపారు. మొత్తానికైతే వేసవిలో థియేటర్లలోకి రావాల్సిన సినిమా గురించి ఇలా టెక్నీషియన్స్ మాటల్లో వింటూ సర్దుకుంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.

దీనికి తోడు వేణు స్వామి కూడా రాజా సాబ్ సినిమా ఇప్పట్లో లేనట్లే అంటూ వార్తలు వైరల్ చేశారు. ప్రభాస్ కాలికి గాయం అయిందని, ఆ కారణంగానే విదేశాలలో ఆయన చికిత్స తీసుకుంటున్నారని, కచ్చితంగా రాజాసాబ్ సమ్మర్ నుంచీ సెప్టెంబర్ కి వాయిదా పడుతుంది అంటూ కూడా చెప్పగా.. ఇప్పుడు అదే మాటలు నిజమవుతాయేమో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానుల ఆందోళనకు తెరపడాలి అంటే ప్రభాస్ స్పందించి తీరాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా కూడా చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాకి సీక్వెల్ సలార్ 2తో పాటు కల్కి 2 చిత్రాలు కూడా చేయనున్నారు. ఏది ఏమైనా ఇన్ని ప్రాజెక్టులు పెట్టుకొని ఇప్పుడు విడుదల చేయకుండా ఆలస్యం చేస్తుండడంపై అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×