Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 సంవత్సరాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి} చెపాక్ మైదానంలో విజయం రుచి చూసింది. సుదీర్ఘ నిరీక్షణకు ఆర్సిబి ముగింపు పలికి.. బ్యాటింగ్ లో మెరుపులతో, బౌలింగ్ లోను అదరగొట్టి శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 2008 తర్వాత ఈ స్టేడియంలో తొలిసారి విజయం సాధించింది.
Also Read: Manoj Tiwary: ధోనికి చెప్పే ధైర్యం ఎవడికీ లేదు… అతనికి నచ్చినప్పుడే బ్యాటింగ్ చేస్తాడు !
అప్పటికి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో చెపాక్ మైదానంలో సీఎస్కే పై 17 సంవత్సరాల తర్వాత విక్టరీ అందుకున్న ఆర్సిబి సంతోషంతో ఉప్పొంగిపోయింది. ముఖ్యంగా ఆ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రవీంద్ర జడేజా పక్కన డాన్స్ చేస్తూ కనిపించాడు.
అంతేకాకుండా మ్యాచ్ అనంతరం ఆర్సిబి డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లంతా సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ అంతా సందడి చేశారు. ఈ విజయం తమకు ఎంతో ప్రత్యేకమని ఆర్సిబి ప్లేయర్లు సెలబ్రేషన్స్ చేసుకుంటున్న వీడియోలను ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంది ఆర్సిబి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ డాన్స్ చేస్తున్న వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 196 పరుగులు చేసింది. ఆర్సిబి బ్యాటర్లలో కెప్టెన్ రజత్ పటిదార్ 32 బంతులలో 51 పరుగులతో చెలరేగాడు. సాల్ట్ 16 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ తో 32 పరుగులు, విరాట్ కోహ్లీ 30 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ తో 31 పరుగులతో రానించాడు. అలాగే టీమ్ డేవిడ్ 8 బంతుల్లో 22 పరుగులతో చివరలో చెలరేగాడు. ఇక చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి మరోసారి రాణించాడు.
Also Read: MS Dhoni: ధోని క్రేజీ స్టంప్… క్షణాల్లోనే వికెట్లు గిరాటేశాడు ?
ఆర్సిబి ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగిన చోట సీఎస్కే బ్యాటర్లు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఓపెనర్ రచన్ రవీంద్ర కాస్త నిలదోక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమయ్యాడు. కాగా చివర్లో మహేంద్రసింగ్ ధోని మెరుపులతో కాస్త ఉరటనిచ్చాడు. అయినప్పటికీ ఆర్సిబి పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా రాణించడంతో ఆర్సిబి విజయం సాధించింది. ఈ సీజన్ లో ఆర్సిబికి ఇది వరుసగా రెండవ విజయం. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కి ఇది తొలి ఓటమి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">