5G Smart phones: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతోంది. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా, తక్కువ బడ్జెట్‌లోనూ అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్న ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రూ. 12,000 లోపు విభాగంలో ప్రీమియమ్ లెవెల్ ఫీచర్లను అందించే ఫోన్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ ధరల్లోనే మంచి డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, మెరుగైన కెమెరా, మన్నికైన బ్యాటరీ ఫోన్ పొందవచ్చు. మంచి స్క్రీన్ రిఫ్రెష్‌రేట్, 5G కనెక్టివిటీ, ఫాస్ట్ చార్జింగ్, స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం వంటి ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్లు తమ ఫోన్లను అధిక పోటీతో విడుదల చేస్తున్నాయి. ఏ అవసరానికైనా సరిగ్గా సరిపోయే ఈ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. iQOO Z9x 5G
డిస్ప్లే: 6.72 అంగుళాలు, 1260p రిజల్యూషన్
ర్యామ్: 8 జీబీ
స్టోరేజ్: 128 జీబీ
బ్యాటరీ: 6000 mAh
వెనుక కెమెరా: 50MP + 2MP
ముందు కెమెరా: 8MP
కొనుగోలు లింక్స్: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
ధర: రూ. 10,999
iQOO Z9x 5జీ ఈ ధర పరిధిలో అత్యుత్తమ ఫోన్‌లలో ఒకటని చెప్పవచ్చు. దీని పెద్ద బ్యాటరీ, హై-రిజల్యూషన్ స్క్రీన్, శక్తివంతమైన ప్రాసెసర్ దీన్ని మంచి ఛాయిస్ గా నిలుపుతుంది.
2. మోటరోలా మోటో G45 5G
డిస్ప్లే: 6.50 అంగుళాలు, 720p రిజల్యూషన్
ర్యామ్: 4 జీబీ
స్టోరేజ్: 128 జీబీ
బ్యాటరీ: 5000 mAh
వెనుక కెమెరా: 50MP + 2MP
ముందు కెమెరా: 16MP
కొనుగోలు లింక్స్: ఫ్లిప్‌కార్ట్
ధర: రూ. 10,990
ఈ ఫోన్ 5G సపోర్ట్‌తో వస్తుంది. ఎక్కువ గేమింగ్ లేదా ఇతర అనేక పనులకు అనుకూలంగా ఉంటుంది.
Read Also: 5G Smartphone Offer: టాప్ బ్రాండ్లకు పోటీగా కొత్త మోడల్.. …
3. Poco X6 Neo 5G
డిస్ప్లే: 6.67 అంగుళాలు, 1080p రిజల్యూషన్
ర్యామ్: 8 జీబీ
స్టోరేజ్: 128 జీబీ
బ్యాటరీ: 5000 mAh
వెనుక కెమెరా: 108MP + 2MP
ముందు కెమెరా: 16MP
కొనుగోలు లింక్స్: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
ధర: రూ. 11,998
Poco X6 Neo 5G పవర్‌ఫుల్ కెమెరా, మంచి డిస్‌ప్లే, గేమింగ్‌కు అనుకూలమైన ప్రాసెసర్‌తో మంచి ఎంపికగా ఉంటుంది.
4. Infinix Note 50X 5G
డిస్‌ప్లే: 6.67 అంగుళాల స్క్రీన్, 720 × 1600 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ డిజైన్
డ్యువల్ సిమ్: 3G, 4G, 5G, VoLTE, Wi-Fi, IR బ్లాస్టర్ సపోర్ట్
ప్రాసెసర్: డైమెన్సిటీ 7300 అల్టిమేట్, ఆక్టా-కోర్, 2.5GHz
మెమరీ & స్టోరేజ్: 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ (హైబ్రిడ్ మెమరీ కార్డ్ సపోర్ట్)
బ్యాటరీ: 5500mAh మన్నికైన బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్
కెమెరా: 50MP డ్యూయల్ రియర్ కెమెరా + 8MP సెల్ఫీ కెమెరా
ఆపరేటింగ్ సిస్టమ్: Android v15
కొనుగోలు లింక్స్: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్
ధర: రూ. 11,499
తక్కువ ధరలో 5G సపోర్ట్‌తో, శక్తివంతమైన ప్రాసెసర్, మంచి కెమెరా, ఫాస్ట్ చార్జింగ్‌ను కోరుకునే వారికి ఇది మంచి ఛాయిస్. వీటిలో మీ అవసరాలను బట్టి మంచి ఫోన్ ఎంపిక చేసుకోవచ్చు.