Pradeep Machiraju : ప్రేమ గుడ్డిది అనే మాటల్ని మనం చాలా సార్లు వినే ఉంటాము. తాజాగా ప్రదీప్ (Pradeep Machiraju) విషయంలో జరిగిన ప్రేమ యవ్వారాన్ని చూస్తే ప్రేమ గుడ్డిదే కాదు మూగది, చెవిటిది కూడా అనిపిస్తుంది. తాజాగా కోకాపేట్ పబ్ లో జరిగిన ప్రదీప్ కు సంబంధించిన గొడవకు సంబంధించి జరుగుతున్న ప్రచారం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం.
ప్రేమ అంటే ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఇష్టం మాత్రమే కాదు నమ్మకం కూడా. ముఖ్యంగా అబ్బాయిలు అన్ని రకాలుగా, అన్ని సమయాల్లోనూ తోడుంటారని గట్టిగా నమ్ముతారు అమ్మాయిలు. అలా నమ్మకం కుదిరితేనే అబ్బాయిలతో ప్రేమ విషయంలో ముందడుగు వేయడానికి ఆసక్తిని కనబరుస్తారు. ఇక అబ్బాయిల ఫస్ట్ డ్యూటీ కూడా తమను నమ్మి వచ్చిన అమ్మాయిలకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవడమే. కానీ తాజాగా ఈ విషయంలో ప్రదీప్ ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తోంది అనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ప్రదీప్ (Pradeep Machiraju) లవ్ స్టోరీలో తనను నమ్మి వచ్చిన లేడీ ఎమ్మెల్యే కి సెక్యూరిటీ కల్పించడంలో విఫలమయ్యాడు అంటున్నారు.
ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) అంటే బుల్లితెరపై ఒక బ్రాండ్ లాంటిది. అతను హ్యాండ్సమ్ గా ఉండడంతో పాటు సమయం సందర్భం చూసుకొని పంచులు వేసి ప్రేక్షకులను హాయిగా నవ్విస్తాడు. అదే అతడిని స్టార్ యాంకర్ గా నిలబెట్టింది. యాంకర్ గా స్థిరపడ్డ ప్రదీప్ కొన్ని షోలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు హీరోగా కూడా ట్రై చేస్తున్నాడు. అయితే ఇంకా హీరోగా స్థిరపడకపోయినప్పటికీ అతనికున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఏమీ కాదు. అయితే ఇదంతా రీల్ లైఫ్ హీరోయిజమే. రియల్ లైఫ్ లో హీరో కాదు జీరో అని ప్రూవ్ చేసుకున్నాడు అనే విమర్శలు విన్పిస్తున్నాయి.
నాలుగు పదుల వయసు వచ్చినా ప్రదీప్ పెళ్లి చేసుకోలేదు. దీంతో బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ట్యాగ్ ను తగిలించుకొని షోలను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను ఏపీలో అధికారంలో ఉన్న లేడీ ఎమ్మెల్యే తో దాదాపు రెండేళ్ల నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్నాడని భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల నుంచి సైలెంట్ గా నడుస్తున్న వీళ్ళిద్దరి రిలేషన్షిప్ తాజాగా కోకాపేట్ లో జరిగిన గొడవతో బయటపడిందనే టాక్ నడుస్తోంది. అయితే సదరు అమ్మాయి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె కోకాపేట్ పబ్ లో ఆమె మాజీ లవర్ కు సంబంధించిన మనుషులు దాడి చేయడం ఇప్పుడు అందరూ ప్రదీప్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు.
ఆమె ఎమ్మెల్యే అయినప్పటికీ గన్ మెన్లను పక్కనపెట్టి ప్రదీప్ (Pradeep Machiraju) ను నమ్మి అతనితో సీక్రెట్ గా అక్కడికి వెళ్ళిందని, కానీ ఏకంగా ఎమ్మెల్యేకి గాయాలు అయ్యేదాకా అతను ఏం చేస్తున్నాడని ప్రహనిస్తున్నారు. గన్ మెన్ లను వదిలి తనను నమ్మి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రదీప్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? అంటూ ప్రదీప్ మాచిరాజుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.