BigTV English

HBD Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్.. సినిమాలు లేకపోయినా ఆస్తులు బాగానే కూడబెట్టిందే..!

HBD Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్.. సినిమాలు లేకపోయినా ఆస్తులు బాగానే కూడబెట్టిందే..!

HBD Pragya Jaiswal:ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. ఈ బ్యూటీ బాలకృష్ణ (Balakrishna) సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎందుకంటే బాలకృష్ణ చేసే వరుస సినిమాల్లో ప్రగ్యాకి అవకాశం లభిస్తోంది. అలా ఇప్పటికే బాలకృష్ణ నటించిన ‘అఖండ’ (Akhanda) సినిమాలో కూడా హీరోయిన్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సంక్రాంతి రేసులో నిలిచిన ‘డాకు మహారాజ్'(Daaku Maharaj) మూవీలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే అఖండ కంటే ముందు బాలకృష్ణ చేసిన సినిమాలు అంత హిట్ అయితే కాలేదు. కానీ అఖండతో బాలకృష్ణ మళ్ళీ కంబ్యాక్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు హిట్ అయ్యాయి. ఇక తాజాగా విడుదలైన డాకూ మహారాజ్ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాలో కూడా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.అలా బాలకృష్ణకు లక్కీ హీరోయిన్ గా మారిపోయిన ప్రగ్యా జైస్వాల్ బర్త్డే ఈరోజు కావడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.మరి ఇంతకీ ప్రగ్యా జైస్వాల్ జీవిత విశేషాలు ఏంటి..? ఆమె ఎన్నికోట్ల ఆస్తి సంపాదించింది? అనేది ఇప్పుడు చూద్దాం..


మోడల్ గా తొలి ప్రయాణం..

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో 1991 జనవరి 12న జన్మించింది. ఇండస్ట్రీలోకి రాకముందు భారతీయ మోడల్ గా పనిచేసింది. అలా 34 ఏళ్ల వయసు ఉన్న ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగం ద్వారానే ఇండస్ట్రీ లోకి ప్రవేశించింది. ఇక తెలుగులోకి క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహించిన ‘కంచె’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ (Varuntej) హీరోగా నటించారు. ఈ సినిమాలో సీతాదేవి పాత్రలో ప్రగ్యా జైస్వాల్ అదరగొట్టేసింది. ఈ సినిమాలో ప్రగ్యా నటనకు గానూ ఉత్తమ డెబ్యూ హీరోయిన్ విభాగంలో ఫిలిం ఫేర్ అవార్డు కూడా లభించింది. ఈ సినిమాతో ప్రగ్యా కి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.


ప్రగ్యా జైస్వాల్ సినిమాలు..

అలాగే నాగార్జున (Nagarjuna) నటించిన ‘ఓం నమో వెంకటేశాయా’ మూవీలో కూడా నటించింది. ఇవే కాకుండా ప్రగ్యా జైస్వాల్ తెలుగులో జయ జానకి నాయక, గుంటూరోడు,నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర, సైరా, అఖండ,డాకూ మహారాజ్ వంటి సినిమాల్లో నటించింది. ఇక అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ-2 మూవీలో కూడా బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.. ఇక ఈ హీరోయిన్ కి ఎక్కువగా అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా బాగానే ఇమేజ్ సంపాదిస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఇంస్టాగ్రామ్ లో పలు రకాల ఫొటోస్,పోస్టులు షేర్ చేస్తూ బాగానే పాపులారిటీ అందుకుంది.

ప్రగ్యా జైస్వాల్ ఆస్తులు..

ప్రగ్యా జైస్వాల్ ఆస్తుల విషయానికి వస్తే.. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా తాను చేసే ఎన్నో వంటకాలను, అలాగే తన గురించి ఎన్నో విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఇక సినిమాల్లో అవకాశాలు లేకపోయినా తన ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ.. గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుని ఫిదా చేస్తోంది.ఇక అలాంటి ప్రగ్యా జైస్వాల్ సంవత్సరానికి రూ.7 నుండి రూ.8 కోట్ల వరకు సంపాదిస్తుందట.ఇప్పటివరకు ఈమె సినిమాలు,బ్రాండ్ ఎండార్స్మెంట్లు మరియు మోడలింగ్ అసైన్మెంట్లు పూర్తిగా కలిపి దాదాపు రూ.50 కోట్ల వరకు ఆస్తిపాస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది.అలాగే ప్రగ్యా జైస్వాల్ కి లగ్జరీ కార్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రగ్యా కి ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కూడా ఉంది. అలా సినిమాలు వ్యాపార ప్రకటనలు చేయగా వచ్చిన డబ్బుతో పలు స్థిర చరాస్తులు కూడబెట్టింది.ఇక ఇవి కేవలం ప్రగ్యా జైస్వాల్ సంపాదించిన ఆస్తులు మాత్రమే. అయితే తాజాగా డాకూ మహారాజ్ విడుదలైన రోజే ప్రగ్యా బర్త్డే కావడం , ఆ సినిమా హిట్ కొట్టడం తనకు లక్కీగా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. మరి డాకూ మహారాజ్ హిట్ తో ప్రగ్యా జైస్వాల్ కి ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వస్తాయా.. ఈ సినిమాతో నైనా ఆమె ఫేట్ మారిపోతుందా అనేది చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×