Rashmika Mandanna: సినీ సెలబ్రిటీలు చాలామంది ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వెళ్తారు అన్నది తెలిసిన విషయమే. రష్మిక మందనా కూడా తన సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా జిమ్‌కు మాత్రం కచ్చితంగా వెళ్తుంది. అప్పుడప్పుడు తన వర్కవుట్ వీడియోలను, ఫోటోలను ఫాలోవర్స్‌తో కూడా షేర్ చేసుకుంటుంది. అలాంటి రష్మికకు తాజాగా ఆ జిమ్ వల్లే గాయమయ్యింది. వర్కవుట్ చేస్తున్నప్పుడు రష్మిక కాలికి గాయం అయ్యిందనే విషయం బయటికొచ్చింది. అప్పటినుండి అసలు తనకు ఏమైందా అని ఫ్యాన్స్ తెగ కంగారుపడిపోయారు. అందుకే తన ఫ్యాన్స్ అందరికీ క్లారిటీ ఇవ్వడం కోసం ఒక పోస్ట్‌ను షేర్ చేసింది రష్మిక మందనా.
సారీ చెప్పేసింది
ఆసుపత్రి బెడ్‌పై కాలికి గాయంతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక మందనా. ప్రస్తుతం రష్మికకు బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ ఉన్నాయి. అందులో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో తనకు గాయమవ్వడం వల్ల కచ్చితంగా ఆ షూటింగ్స్ అన్నింటికి బ్రేక్ పడుతుంది. దాని వల్ల మూవీపై భారీ ఎఫెక్టే పడొచ్చు. అందుకే తన ఆరోగ్యం ఎలా ఉంది అనేది ప్రేక్షకులతో పాటు తన దర్శకులకు కూడా ఒకేసారి అప్డేట్ ఇచ్చింది రష్మిక. తన వల్ల దర్శకులు ఇబ్బంది పడతారని వారికి సారీ చెప్పింది. అంతే కాకుండా గాయమయినా కూడా ఎలాగైనా షూటింగ్స్‌లో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
Also Read: నొప్పితో బాధపడుతుంటే ఆ దర్శకుడు అలా అన్నాడు.. నిత్యా మీనన్ ఆసక్తికర కామెంట్స్
గెంతుతూ ఉంటాను
‘సరే.. ఇది నాకు హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటా. జిమ్‌లో నన్ను నేను గాయపరుచుకున్నాను. మరికొన్ని వారాలు, నెలలు లేదా దేవుడికే తెలియాలి ఎన్ని రోజులు నేను గెంతుతూనే ఉండాలి. అలా గెంతుకుంటూ థామా, సికిందర్, కుబేర సెట్స్‌కు వెళ్లిపోతానేమో. ఇలా లేట్ చేస్తున్నందుకు నా దర్శకులందరికీ సారీ. నేను త్వరలోనే నా కాళ్లు యాక్షన్‌కు సిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి వస్తాను. లేదా గెంతడానికి సిద్ధంగా ఉన్నా ఓకే. అప్పటివరకు నన్ను చేరుకోవాలంటే నేను ఏదో ఒక మూల గెంతుకుంటూ కనిపిస్తాను. అదే నా వర్కవుట్ ఇంక’’ అంటూ గాయమయిన విషయం కూడా చాలా ఫన్నీగా చెప్పుకొచ్చింది రష్మిక మందనా (Rashmika Mandanna).
బాలీవుడ్‌లో బిజీ
ఈ పోస్ట్ చూసిన రష్మిక ఫ్యాన్స్ అంతా తను త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఏ సందర్భంలో అయినా రష్మిక చాలా కూల్‌గా ఉంటుందని తనను ప్రశంసిస్తున్నారు. కాలికి గాయమయ్యే ముందు రష్మిక.. తన బాలీవుడ్ మూవీ ‘సికిందర్’తో బిజీగా ఉంది. మొదటిసారి హిందీలో సల్మాన్ ఖాన్‌తో జోడీ కడుతూ రష్మిక నటిస్తున్న చిత్రమే ‘సికిందర్’. ఈ మూవీని మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నారు. అది మాత్రమే కాకుండా రష్మిక చేతిలో మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకవైపు హిందీలో బిజీగా ఉన్నా కూడా సౌత్ సినిమాలను మాత్రం పక్కన పెట్టడం లేదు ఈ బ్యూటీ. తెలుగులో కూడా ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘కుబేర’ చిత్రాలతో బిజీగా ఉంది.