BigTV English

Prakash Raj : ప్రాణాలు పోయినా స్పందించవా ప్రకాష్ రాజ్?

Prakash Raj : ప్రాణాలు పోయినా స్పందించవా ప్రకాష్ రాజ్?

Prakash Raj : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఆన్ స్క్రీన్ పైన ప్రకాష్ రాజ్ చాలామంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా ప్రకాష్ రాజ్ భావజాలాన్ని ఇష్టపడే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ప్రకాష్ రాజ్ మాట్లాడిన అన్ని విషయాలని కొంతమంది అంగీకరించక పోయినా కూడా కొన్ని విషయాల్లో మాత్రం బాగానే మాట్లాడాడు అని అనిపించుకుంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ప్రతిసారి ఏదో ఒక విషయం మాట్లాడుతూనే ఉంటాడు ప్రకాష్ రాజ్. అలానే బిజెపి ప్రభుత్వాన్ని మోడీని కూడా కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటాడు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో పవన్ కళ్యాణ్ ని గతంలో కంపేర్ చేస్తూ చాలా మాటలు మాట్లాడాడు. కరెంట్ ఇష్యూ ఏం జరిగినా కూడా ప్రకాష్ రాజ్ నుంచి ఒక ట్వీట్ వస్తుంది. జస్ట్ ఆస్కింగ్ అంటూ అడగడం మొదలుపెడతాడు. కానీ ఈసారి మాత్రం నోరు మెదపట్లేదు మోనార్క్.


ప్రాణాలు పోయినా స్పందించవా.?

పెహల్గాం ఇన్సిడెంట్ ఎంతమంది భారతీయులను కలిచివేసిందో మాటల్లో చెప్పలేనిది. దాదాపు 26 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నుంచి భారతీయుల రక్తం మరిగిపోతుంది అని చెప్పాలి. అయితే ఈ విషయంపై ప్రతి భారతీయుడు తనదైన గొంతుకను వినిపిస్తున్నారు. తెలుగు సెలబ్రిటీస్ సైతం దీని గురించి మాటలు మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతున్న కూడా ప్రకాష్ రాజ్ అసలు ఎందుకు స్పందించట్లేదు. ప్రాణాలు పోయినా కూడా స్పందించవా.? ఎప్పుడూ ఒక వర్గానికి, కొంతమంది భావజాలాలకు మాత్రమే పరిమితమై ఉండిపోతావా.? మనుషులు ప్రాణాలు అంటే లెక్క లేదా.? కాశ్మీరు పర్యటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిపై కనీసం మాట్లాడని ప్రకాష్ రాజ్ పై కూడా చాలామంది తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పటికైనా ప్రకాష్ రాజ్ దీనికి స్పందిస్తాడా లేదా ఎదురు చూడాలి.


రియల్ లైఫ్ మోనార్క్

మామూలుగా ప్రకాష్ రాజ్ నటనలో ఏ స్థాయిలో ఉన్నారు మాటల్లో చెప్పలేనిది. ఒక దర్శకుడు పాత్ర ప్రకాష్ రాజ్ కోసం రాస్తే దానికి ప్రాణం పోసే టాలెంట్ ఉన్న నటుడు. అలానే ఒక సినిమాలో నేను మోనార్కుడ్ని నన్నెవరూ మోసం చేయలేరు అనే డైలాగ్ ఉంటుంది. అయితే నిజజీవితంలో కూడా మోనార్కుడు లా ప్రవర్తిస్తున్నాడు అనే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయానికి స్పందించే ప్రకాష్ రాజ్ ఈ విషయంలో ఎందుకు పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తున్నారు అర్థం కాని విషయం. ఏదేమైనా ఈ కథనాలు తన చెవిన పడిన తర్వాత అయినా ప్రకాష్ దీనిపైన నోరు మెదపాలి. తన మేధావితనం ఏంటో ఇప్పుడు జవాబు ఇవ్వాలి.

Also Read : Sundar C: నయనతార కమిట్మెంట్ ఆ రేంజ్ లో ఉంటుంది

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×