Singer Pravasthi:గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా సింగర్ ప్రవస్తి (Singer Pravasthi) పేరే ఎక్కువగా వినిపిస్తోంది. దాదాపు 25 సంవత్సరాలుగా శ్రోతలను నిర్విరామంగా అలరిస్తున్న ‘పాడుతా తీయగా’ కార్యక్రమం పై ప్రవస్తి చేసిన ఆరోపణలు ఒక్కసారిగా అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Bala Subrahmanyam) హోస్ట్ గా ఉన్నప్పుడు తాను చైల్డ్ సింగర్ గా ఇందులో పాటిస్పేట్ చేశానని, అప్పుడు తనకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని.. కానీ తనకు 19 సంవత్సరాల వయసొచ్చిన తర్వాత ఎస్పీ చరణ్ (SP Charan) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో తనపై బాడీ షేమింగ్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ప్రవస్తి.
అన్యాయాన్ని బయటపెట్టిన సింగర్ ప్రవస్తి..
ముఖ్యంగా సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి (MM .Keeravani), రచయిత చంద్రబోస్ (Chandrabose), సింగర్ సునీత (Singer Sunitha) తనపై పక్షపాతం చూపించారని.. ఎంత కష్టపడినా సరే తాను పాడడం వారికి ఇష్టం లేదన్నట్టుగానే బిహేవ్ చేశారు అంటూ తెలిపింది. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ పై కూడా విమర్శలు గుప్పించింది ప్రవస్తి . తనను బొడ్డు కింద చీర కట్టుకొని రమ్మని వేధించే వారని, ఇక బాడీ షేమింగ్ చేశారని ,ప్రత్యేకించి కాస్ట్యూమ్ డిజైనర్ నా అధిక బరువు కారణంగా నాజూకైన దుస్తులు ధరించడం నీ వల్ల కాదని అవమానించారు అంటూ తెలిపింది. ఇక ప్రత్యేకించి తన తల్లిని కూడా నువ్వు అని సంబోధించి సునీత అవమానించారు అంటూ ఒక వీడియో రిలీజ్ చేయగా..దీనిపై సునీత స్పందిస్తూ..అప్పుడు ముద్దు చేసినట్టు ఇప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేయలేము కదా అంటూ కౌంటర్ ఇచ్చింది. దీనికి మళ్లీ ప్రవస్తి ఈ ఒక వీడియో రిలీజ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది.
కులగజ్జి తగ్గదా..?
ఇలా కాంట్రవర్సీ పెరిగిపోతున్న వేళ కొంతమంది కుల గజ్జి ఉన్నవాళ్లు..” ప్రవస్తి ది ఏ కులం?” అంటూ గూగుల్లో సెర్చ్ చేయడం ఆశ్చర్యంగా మారింది. ముఖ్యంగా ఇలా కాంట్రవర్సీ జరుగుతున్న వేళ కొంతమంది గూగుల్ తల్లిని సింగర్ ప్రవస్తి ఆరాధ్య కులం ఏమిటి? అంటూ అడుగుతున్నారు. ఇక 2025 లో కూడా మనం క్యాస్ట్ గోలలో ఉన్నాం అంటే ఇక పరిస్థితులు ఇంకా మారలేదని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉండదేమో.. గత వారం రోజుల డేటా తీయగా ఏప్రిల్ 17వ తేదీన ప్రవస్తి ఆరాధ్య కులం ఏమిటో తెలుసుకోవాలని ఏపీలో జనాలు ఆసక్తి కనబరిచారు. యంగ్ సింగర్ క్యాస్ట్ గురించి గూగుల్ చేయడం మొదలుపెట్టారు ఆల్మోస్ట్ 75 మంది ప్రవర్తి ఆరాధ్య కులం గురించి సెర్చ్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 23న మరికొంతమంది ఆరాధ్య గురించి, ఆమె కులం గురించి వెతికారు. ఇక ఎందుకో గాని అటు తెలంగాణలో కూడా ప్రవస్తి ఆరాధ్య కులం పై కాస్త ఆలస్యంగా ఆసక్తి మొదలైంది.ఏప్రిల్ 23న ఆమె క్యాస్ట్ గురించి గూగుల్ చేశారు. ఇకపోతే ఏపీ , తెలంగాణ ప్రజలకు మాత్రమే ఈ కుల పిచ్చి ఉందనుకుంటే పొరపాటే.. మన పొరుగున ఉన్న తమిళనాడు కూడా ప్రవస్తి కులం గురించి గూగుల్ చేయడం ఆశ్చర్యంగా మారింది. ఇప్పటివరకు ఈ గొడవను చాలా మంది సింగింగ్ షోలో ఒక చిన్నారికి జరిగిన వివక్షతగా మాత్రమే చూడగా.. ఈ సమస్యని ఇప్పుడు కులం రొంపిలోకి లాగుతున్నారు. అసలే మనోభావాలు ఎక్కువగా దెబ్బ తింటున్నాయి. ఇలా సినిమా రంగంలోనే కాకుండా క్రియేటివిటీ ఫీల్డ్ లో కూడా కులగజ్జిని క్రియేట్ చేస్తున్నారు అంటే కచ్చితంగా దీనివల్ల తెలివైన వారిని ఇండస్ట్రీ కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది.ఏది ఏమైనా ఈ జనరేషన్లో కూడా ఇలా కులం గురించి సెర్చ్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి.
ప్రవస్తి మాత్రమే కాదు సునీత కులం పై కూడా..
ఈ పాడుతా తీయగా షో ద్వారా వివాదంలోకి ఎక్కిన ప్రవస్తి మాత్రమే కాదు సింగర్ సునీత (Sunitha) కులం కూడా గూగుల్ సెర్చ్ చేస్తూ ఉండడం గమనార్హం. సునీత గురించి గత కొన్ని దశాబ్దాలుగా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఏమైనా కుల పిచ్చితో ఆమె ఇలా ప్రవస్తిని దూరం పెట్టిందా? అనే కోణంలో అటు ప్రవస్థి ఇటు సునీతల కులం గురించి గూగుల్ సెర్చ్ చేస్తుండడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Virupaksha Sequel Update: విరూపాక్ష సీక్వెల్ లోకి యంగ్ బ్యూటీ.. మెప్పిస్తుందా..?