Sundar C: తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ డైరెక్టర్స్ లో సుందర్ సి ఒకరు. సుందర్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం సినిమాను తీశారు. అలానే అన్బే శివన్ అనే సినిమా ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సుందర ఒక తరుణంలో దర్శకుడుగా మాత్రమే కాకుండానే నటుడుగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో కెరియర్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నయనతార హీరోయిన్గా మూకుత్తి అమ్మన్ 2 అనే సినిమాను చేస్తున్నాడు.
మూకుత్తి అమ్మన్
ఆర్జే బాలాజీ దర్శకుడుగా 2020లో వచ్చిన సినిమా మూకుత్తి అమ్మన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. శరవణన్ ఈ సినిమాకి సహదర్శకత్వం వహించారు. అయితే నయనతార తో పాటు బాలాజీ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. ఒక న్యూస్ జర్నలిస్ట్ ఒక నకిలీ దేవుడిని ఎలా బయటపెట్టాడు అని స్టోరీ తో ఈ సినిమా రన్ అవుతుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ బాలాజీ తీస్తాడని, నయనతార పాత్రలో త్రిష కృష్ణ నటిస్తారు అని వార్తలు వచ్చాయి. అలానే ఈ పాత్ర కోసం శృతిహాసన్ కూడా సంప్రదించినట్లు తెలిసింది. ఇకపోతే ఈ సినిమా బాలాజీ కాకుండా సుందర్ చేయబోతున్నట్లు 2024 సెప్టెంబర్ 16న అధికారికంగా ప్రకటించారు. మూకుత్తి అమ్మన్ 2 అనే టైటిల్ను ఈ సినిమాకి పెట్టారు. ఈ సినిమాను వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ మరియు రౌడీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
నయనతార కమిట్మెంట్
అయితే నయనతార గురించి చాలా వార్తలు బయటకు వస్తున్న తరుణంలో తనతో పని చేసే దర్శకుడుగా సుందర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నయనతార కమిట్మెంట్ గురించి ఎవరికీ తెలియదు ఒకసారి సెట్ లో అడుగు పెట్టారు అంటే, ఆమె షూటింగ్ ప్యాకప్ చెప్పే వరకు కూడా సెట్ లోనే ఉంటారు అంటూ తెలిపారు. మధ్యలో కొంత సమయం ఖాళీ దొరికినా కూడా క్యారీ వ్యాన్ లోకి వెళ్ళండి అని చెప్పినా కూడా ఆవిడ లేదు పర్వాలేదు నేను సెట్ లో ఉంటాను అని చెబుతూ ఉంటారు. అంత డెడికేటెడ్ యాక్టర్ నయనతార అంటూ ఆవిడపై ప్రశంసలు కురిపించారు దర్శకుడు సుందర్.ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. అలానే ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఏ స్థాయిలో అంచనాలు నిలబడతాయో ఎదురు చూడాలి. ఈ సినిమా హిట్ అయితే సుందర్ కి కూడా మంచి కం బ్యాక్ అవుతుంది.
Also Read : Nani : నేను ఆయనకు కాంపిటేషన్ కాదు, మీకు టైం ఉంటే నా సినిమా చూడండి