BigTV English

Prakash Raj: దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి.. పవన్‌ను ఇంకా రెచ్చగొడుతున్నాడే

Prakash Raj: దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి.. పవన్‌ను ఇంకా రెచ్చగొడుతున్నాడే

Prakash Raj: కొంచెం గ్యాప్ వచ్చినా కూడా అందులోకి నటుడు ప్రకాష్ రాజ్ దూరిపోతున్నాడు. వివాదం మొదలవ్వడం ఆలస్య.. నేనున్నా.. నేనున్నా అంటూ వచ్చేస్తాడు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన వివాదం అయితే.. ముందు నేనే ఉంటా అన్నట్లు ప్రకాష్ రాజ్ వాదన ఉంటుంది.  ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాలను షేక్ చేస్తున్న వివాదం తిరుపతి లడ్డూ వివాదం. స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యిని కలిపారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలతో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు కోర్టువరకు చేరింది. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వును కలిపారని, ఇదంతా వైసీపీ నిర్వాకమని ఆరోపణలు మొదలయ్యాయి.


ఇక దీన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు. సనాతన ధర్మం పేరుతో.. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టడం.. సనాతన ధర్మం గురించి ఎవరు తప్పుగా  మాట్లాడినా సహించేది లేదని చెప్పుకొచ్చారు. ఇక ఈ వివాదాన్ని మాత విద్వేషాలను రేకెత్తించేలా చేయొద్దని ప్రకాష్ రాజ్  ఇందులోకి దూరాడు. అక్కడనుంచి మొదలయ్యింది వీరి మధ్య యుద్ధం.  పవన్.. ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇవ్వడం.. ఆయన ఈయనకు సెటైర్ వేయడం జరుగుతూనే ఉంది.

జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రకాష్ రాజ్.. సెటైర్లు వేయడం మాత్రం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. నేడు తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపినట్లు సాక్ష్యం ఉందా అని ప్రశ్నించింది. లడ్డూ  కల్తీ అయ్యినాలు భక్తులు ఎవరైనా ఫిర్యాదు చేశారా.. ? అని అడిగింది.  అంతేకాకుండా  కేవలం ఒక ల్యాబ్ కు మాత్రమే పంపి కల్తీ అని అంటున్నారు.. సెకండ్ ఒపీనియన్ కు మరో ల్యాబ్ కు ఎందుకు పంపలేదని ఫైర్ అయ్యింది.


ప్రాధమిక ఆధారాలు లేకుండా మీడియా ముందుకు ఎందుకు వెళ్లారని,  విచారం పూర్తికాకముందే  ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ప్రకటించి భక్తుల మనోభవాలను దెబ్బతీసారని తెలిపింది.  ఇక సిట్ ను విచారించమని చెప్పి.. మీరెందుకు మీడియా ముందుకు వెళ్లారని ప్రశ్నించిన  న్యాయస్థానం.. దేవుళ్లను రాజకీయం చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. సుదీర్ఘ విచారణ అయ్యాక.. అక్టోబర్  3 కు ఈ కేసును వాయిదా వేసింది.

ఇక  సుప్రీం కోర్టు తీర్పుకు సంబంధించిన ఒక పోస్టర్ ను ప్రకాష్ రాజ్ షేర్ చేస్తూ..” దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్ ” అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటే మొదటి నుంచి నేను అదే చెప్తున్నాను.. ఇప్పుడు  న్యాయస్థానం కూడా అదే తీర్పు ఇచ్చింది. నేనేం తప్పు చెప్పలేదు. నేషనల్ లెవెల్లో ఈ  సమస్యను పెద్దదిగా చూపించకండి అని ట్వీట్ చేస్తే..  పవన్ కళ్యాణ్ వేరేవిధంగా అర్ధం చేసుకొని, సనాతన ధర్మం అని, చేయని తప్పుకు కార్తీ చేత క్షమాపణ చెప్పించుకోవడం,  ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని పొందాలనుకున్నారు.. ఇప్పుడేమైందని.. గర్వంగా ఈ ఒక్క పోస్ట్ తో పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ సెటైర్ వేశాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ రేంజ్ లో పవన్ ను రెచ్చగొడితే.. ఆయన ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×