Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఏం జరుగుతుంది అస్సలు అని ఆడియన్స్ బుర్ర గోక్కుంటున్నారు.. నిన్న వీకెండ్ లో సోనియా ఆకుల హౌస్ నుంచి బయట వచ్చేసింది. ఇక హౌస్ లో 10 మంది ఉన్నారు.. సోనియా హౌస్ లో చేసిన పనులకు విసిగిపోయిన జనం ఆమె బయటకు వచ్చిన సందర్బంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఆమె రావడంతో నిఖిల్, పృథ్విలు అయోమయం అవుతున్నారు. ఇక ఈ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో మిడ్ ఎలిమినేషన్ ఉందని నాగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎవరు బయటకు వెళ్తారా అని ఆడియన్స్ తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక ఎవరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అవుతారో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ఇక పోతే సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ జరుగుతాయన్న విషయం తెలిసిందే.. ఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగానే జరిగినట్లు కనిపిస్తుంది. మంటల్లో ఫొటో వేయాలి అనే కాన్సెప్ట్‌తో ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ వారం విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం, మణికంఠ, నబీల్, నిఖిల్ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో ఆదిత్య, నైనికకి తప్పితే మిగిలిన వాళ్లకు కాస్తోకూస్తో ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరిలో ఎవరొకరిని హౌస్ నుంచి బిగ్ బాస్ ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్.. అయితే ఆదిత్య ఓం ఆట తీరు సరిగ్గాలేదు. టాస్క్ లు సరిగ్గా ఆడలేక పోతున్నారని అందులోనూ హెల్త్ సమస్యలతో పోరాడుతున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే వచ్చే వారం దసరా సందర్భంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు ఉన్నాయి. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్లలో ముక్కు అవినాష్, రోహిణి, గౌతమ్, నయని పావని, హరితేజ, డాక్టర్ బాబులు ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. మరి హౌస్ లోకి ఎవరు ముందుగా వస్తారన్న సంగతి ఈ వారంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ 8 సీజన్ తెలుగు సరిగ్గా ఆడియన్స్ ను ఆకట్టుకోలేదని తెలుస్తుంది. అందుకు కారణం కూడా అనేకం ఉన్నాయి. గత సీజన్లలో కంటెస్టెంట్స్ తమ మాటతో, ఆటతో ఆకట్టుకున్నారు.. కానీ ఈ సీజన్ గొడవలతో హడావిడి చేస్తున్నారు. ఇక బిగ్‌బాస్ టీమ్ కూడా ఏదో ప్రయత్నిస్తున్నారు కానీ వర్కౌట్ కావట్లేదు. ఇప్పటికీ ఐదు వారాలు పూర్తయింది కానీ రెగ్యులర్‌గా షో చూస్తే కొందరికి తప్పితే మిగతా ప్రేక్షకులు దీనివైపే చూడట్లేదు.. ఇది బిగ్ బాస్ కు తెలిసిందేమో అందుకే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంచారు. మరి ఎవరు వెళ్తారు? ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో? తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఈ వారం నిఖిల్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కువ మంది నైనికను నామినేట్ చేసారు మరి ఎవరు వెళ్తారో చూడాలి..