BigTV English

Akkineni Akhil : అయ్యగారి వెనుక కేజీఎఫ్ సైన్యం… రివీల్ చేసిన అమ్మగారు

Akkineni Akhil : అయ్యగారి వెనుక కేజీఎఫ్ సైన్యం… రివీల్ చేసిన అమ్మగారు

Akkineni Akhil : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. సినిమాల్లోకి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇవ్వకముందే మంచి గుర్తింపు సాధించిన నటులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని అఖిల్ పేరు మొదటి వినిపిస్తుంది. సిసింద్రీ సినిమాతో బాల నటుడుగా అరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్ చాలా చిన్న ఏజ్ లోనే మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అవుతున్న తరుణంలో అఖిల్ క్రికెట్ తో చాలామందిని ఆశ్చర్యపరిచాడు.


ఒక సందర్భంలో అఖిల్ మంచి క్రికెటర్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకమైన సినిమా మనం. ఆ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ అందరూ కూడా కనిపించారు. అయితే అంతా అయిపోయింది అనుకునే తరుణంలో అఖిల్ అక్కినేని ఎంట్రీ ఆ సినిమాతో మారు మ్రోగిపోయింది. ఇక అక్కినేని ఫ్యామిలీకి అసలైన వారసుడు దిగాడు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చింది. ఎట్టకేలకు వివి వినాయక దర్శకత్వంలో అఖిల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మజ్ను సినిమా కూడా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. వరస సినిమాలు చేస్తున్న కూడా ఫలితం మాత్రం మామూలుగానే ఉంది. ఇక ఇండియా క్రికెట్ టీం లో rcb కి కప్ రానట్లు, అక్కినేని అఖిల్ కి కూడా హిట్ రాదు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. సరిగ్గా అదే తరుణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అది కేవలం అఖిల్ కు మాత్రమే కాకుండా బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా మంచి కం బ్యాక్ సినిమా అయింది.


ఇక అఖిల్ కెరియర్లో సెట్ అయిపోయాడు అనుకునే తరుణంలో ఊహించని రూపంలో అఖిల్ ను ఏజెంట్ సినిమా డిజాస్టర్ వెంటాడింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా చేసిన సినిమా ఏజెంట్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రమైన డిజాస్టర్ ను చవిచూసింది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు అఖిల్ నుంచి ఒక సినిమా కూడా రాలేదు. ఇక ప్రస్తుతం అఖిల్.. కిషోర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు.

అయితే జీవితంలో ఒడిదుడుకులు అనేవి కామన్ గా జరుగుతూ ఉంటుంది. సక్సెస్ కి ఫెయిల్యూర్ కి చాలా తేడా ఉంటుంది. సక్సెస్ వచ్చినప్పుడు మన చుట్టూ పదిమంది చేరుతారు. కానీ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎవరు ఉండరు. నా అభిమానుల అంచనాలను నిలబెట్టుకోలేకపోతున్నాను అని అఖిల్ లో లోపల తపన పడుతూ ఉంటాడు అని చెప్పొచ్చు. అయితే అఖిల్ కెరియర్ లో తనకి ఒక మెంటర్ ప్రశాంత్ నీల్ ఉన్నట్లు అఖిల్ మదర్ అక్కినేని అమల రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

చాలా ఒడిదుడుకుల్లో ప్రశాంత్ ని అక్కినేని అఖిల్ కి సపోర్ట్ గా నిలబడి తనలో ఉత్సాహాన్ని నింపారు అని చెప్పుకొచ్చారు అమల. దీనితో చాలామందికి అయ్యగారు వెనకాల కేజీఎఫ్ సైన్యమే ఉంది అంటూ ఒక క్లారిటీ వచ్చింది. ఏదేమైనా ప్రశాంత్ నీల్ అఖిల్ తో సినిమా చేసిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు అని ఈ స్టేట్మెంట్ తో అర్థమైంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×