Sneha – Prasanna Kumar..అందాల తారగా పేరు సొంతం చేసుకున్న స్నేహా(Sneha) .. ఒకానొక సమయంలో తన అందంతో, నటనతో యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోలందరి సినిమాలలో నటించి, టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతోపాటు సౌత్ ఇండియా సినిమాలలో కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న స్నేహా.. కెరియర్ పీక్స్ లో ఉండగానే నటుడు ప్రసన్నకుమార్ (Prasanna Kumar) ను వివాహం చేసుకొని, వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన ఈమె.. ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, పలువురు స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్నేహ..
అయితే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఆ చిత్రాలు ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. 2000 సంవత్సరం నుండీ 2020 సంవత్సరం వరకు హీరోయిన్గా చాలా సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో ప్రత్యేక ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహాకు ఒక వింత వ్యాధి ఉందంటూ ఆమె భర్త ప్రసన్నకుమార్ చెప్పుకు రావడంతో ఇండస్ట్రీలో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. 2012 మే 11వ తేదీన ప్రసన్నను వివాహం చేసుకుంది స్నేహ. అప్పటినుంచి వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
స్నేహా కి వచ్చిన వ్యాధిపై స్పందించిన ప్రసన్నకుమార్..
ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ దంపతులు.. తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలోనే స్నేహాకి ఉన్న అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చారు ప్రసన్న. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..”స్నేహ కి ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) అనే ఒక సమస్య ఉంది. తనకు ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా కిచెన్ క్లీన్ గా ఉండాల్సిందే. అయితే ఈ అరుదైన ఓసీడీ సమస్య గురించి భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. ఇంట్లో అది బాలేదు, ఇది బాలేదు అని రోజుకి మూడుసార్లు అన్ని మారుస్తుంది. అయితే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు మార్చకుండా ఉన్నది నన్ను మాత్రమే” అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు ప్రసన్న. ఇక ప్రసన్న చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక అంతే కాదు స్నేహా కి ఉన్న సమస్య గురించి చెప్పడంతో అందరూ శర్వానంద్ మూవీని గుర్తు చేసుకుంటూ ఉండడం గమనార్హం.
స్నేహ సినిమాలు..
ఒకప్పుడు పెళ్లికి ముందు హవా నడిపించిన ఈమె పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ కెరియర్ సాగిస్తోంది. అలా రామ్ చరణ్ (Ram Charan) ‘వినయ విధేయ రామ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. పలు హిట్ సినిమాలలో భాగమవుతూ దూసుకుపోతోంది. అంతేకాదు పలు షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది స్నేహా.