Courtroom Dramas: ఈరోజుల్లో కొత్త కొత్త జోనర్లలో వచ్చే సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందులో కోర్ట్ రూమ్ డ్రామాస్ కూడా ఒకటి. ఈమధ్య కాలంలో విడుదలయిన కోర్ట్ రూమ్ డ్రామాస్‌కు ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరిగిపోతోంది. తాజాగా అందులో నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘కోర్ట్’ కూడా యాడ్ అయ్యింది. ప్రీమియర్ షోల నుండే ఈ మూవీకి మంచి టాక్ లభిస్తుండడంతో ఇలాంటి జోనర్‌లో ఇంకేమైనా సినిమాలు ఉన్నాయా అని ప్రేక్షకులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సినిమాలో కొన్ని బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామాస్ ఉన్నాయన్న విషయం తెలుసుకున్నారు.
పింక్
కోర్ట్ రూమ్ డ్రామా అనగానే చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా ‘పింక్’. అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ఈ సినిమాలో తాప్సీ ఇతర కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీ కథ నచ్చి సౌత్ భాషల్లో కూడా దీనిని రీమేక్ చేశారు మేకర్స్. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’.. ‘పింక్’కు రీమేక్‌గానే తెరకెక్కింది. తమిళంలో ఈ సినిమా రీమేక్‌లో అజిత్ నటించాడు.
నేరు
ఇటీవల విడుదలయిన బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామాస్‌లో ఒకటి ‘నేరు’. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనస్వరా రాజన్ మరొక లీడ్ రోల్‌లో నటించింది. ఒక బ్లైండ్ అమ్మాయికి జరిగిన అన్యాయం కోసం పోరాడడానికి మోహన్ లాల్ లాయర్‌గా రంగంలోకి దిగుతాడు. అనుక్షణం ఉత్కంఠగా సాగే ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీని ఓటీటీలో చూసిన ప్రేక్షకులు చాలావరకు పాజిటివ్ రివ్యూలు అందించారు.
Also Read: వైష్ణవి చైతన్య ఫస్ట్ ముద్దు.. సిద్ధు మరీ ఇంత రొమాంటికా.?
సిర్ఫ్ ఏక్ బంధా కాఫీ హై
బాలీవుడ్ నటీనటుల్లో మనోజ్ బాజ్‌పాయ్ ఒక స్టోరీ సెలక్ట్ చేశాడంటే చాలు.. కచ్చితంగా అది సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంటుంది. తన స్టోరీ సెలక్షన్‌పై ప్రేక్షకుల్లో అలాంటి నమ్మకం క్రియేట్ అయ్యేలా చేశాడు మనోజ్. అలా తాజాగా తను లాయర్ పాత్రలో కనిపించిన కోర్ట్ రూమ్ డ్రామా ‘సిర్ఫ్ ఏక్ బంధా కాఫీ హై’ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం జీ5లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.
ఓఎమ్‌జీ 2
అసలు దేవుడు ఉన్నాడా, లేడా అనే కథాంశంతో బాలీవుడ్‌లో ‘ఓఎమ్‌జీ’ అనే సినిమా తెరకెక్కింది. ఇక దానికి సీక్వెల్‌గా ‘ఓఎమ్‌జీ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇందులో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ప్రేక్షకులకు స్పష్టంగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా మామూలుగా సాగిపోయినా.. సెకండ్ హాఫ్ అంతా కోర్ట్ రూమ్ డ్రామాగా చాలా థ్రిల్లింగ్‌గా నడుస్తుంది. యామీ గౌతమ్, అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి తమ నటనతో ఆకట్టుకున్నారు.
Also Read: చిక్కుల్లో విష్ణుప్రియా.. అరెస్ట్ తప్పదు.?
జై భీమ్
వెనకబడిన సామాజిక వర్గానికి చెందినవారు ఎదుర్కునే సమస్యలు ఏంటి అని ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో చూపించారు. కానీ వాటన్నింటిలో ‘జై భీమ్’ బెస్ట్ అని తమిళ ప్రేక్షకులు అంటుంటారు. ఒక ప్రముఖ లాయర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య హీరోగా నటించాడు. అప్పట్లో ఈ మూవీకి నేషనల్ అవార్డ్ రానందుకు చాలామంది ఆడియన్స్ ఫీలయ్యారు. కానీ ఈ సినిమా మరెన్నో అవార్డులతో పాటు ప్రేక్షకుల దృష్టిలో స్పెషల్‌గా నిలిచిపోయింది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.