Big Stories

HanuMan: ఓటీటీలోనూ ‘హనుమాన్‌’ హవా.. 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసేసిందిగా..

prasanth varma
prasanth varma

HanuMan OTT Views (Tollywood news in Telugu): ప్రతి ఒక్క దర్శకుడిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. తరచూ వాళ్లు కొత్తదనాన్ని కొరుకుంటారు. సినిమాను ఏవింధ తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే విధంగా ఆలోచిస్తుంటారు. అయితే ఇటీవల అలాంటి ఆలోచనతో ఆడియన్స్ నాడి పట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్టులతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకరు.

- Advertisement -

‘జాంబీ రెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ చాలా డిఫరెంట్‌గా ఉండటంతో ప్రేక్షకాభిమానులు థియేటర్లలకు క్యూ కట్టారు. ఆ తర్వాత ‘హనుమాన్’ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ‘జాంబిరెడ్డి’ కాంబోనే ‘హనుమాన్’కు సెట్ అయింది.

- Advertisement -

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను కైవసం చేసుకుంది. సంక్రాంతి రేసులో బడా హీరోల సినిమాలు రిలీజ్ అయినా.. వాటన్నింటినీ దాటుకుని సంక్రాంతి విన్నర్‌‌గా హనుమాన్ మూవీ నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీకి గ్రాఫిక్స్ ఓ రేంజ్‌లో ఉందనే చెప్పాలి.

Also Read: రామ్ చరణ్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ రెడీ

ఇక ఇటు తెలుగుతో పాటు అటు హిందీలోనూ ఈ చిత్రం సెన్సేషన్ సృష్టించింది. ఒక చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్.. బాహుబలి, ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురములో వంటి భారీ సినిమాల రికార్డ్స్‌ను బద్దలు కొట్టింది. అంతేకాకుండా యూఎస్‌లో ఐదు మిలియన్ డాలర్స్‌కు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది.

కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు లాభాల పంట పండించింది. దాదాపు రూ.250 కోట్ల గ్రాస్‌ను సాధించి అబ్బురపరచింది. ఇక థియేటర్‌లో దుమ్ము దులిపేసిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది.

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ప్రస్తుతం ప్రసారం అవుతోంది. అయితే థియేటర్‌లలో అబ్బురపరచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదే హవా చూపిస్తోంది. జీ5 ఓటీటీలో గంటల్లోనే మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ని నమోదు చేసి రికార్డ్ సృష్టించింది.

Also Read: ఇండియన్ ఫుట్‌బాల్‌ టీంపై హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్

కేవలం 5 రోజుల్లో 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను నమోదు చేసినట్టుగా ఓటీటీ సంస్థ జీ5 సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీనిబట్టి చూస్తే హనుమాన్ మూవీకి ఎంతటి క్రేజ్ ఉందో అర్థం అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ 3డి వెర్షన్ త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వర్క్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News