BigTV English

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ రెడీ

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ రెడీ


Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27. ఈ వేడుకకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో చరణ్ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఒక్క ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చరణ్ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

అలాగే తమ ఫ్యాన్స్‌ను సంతోష పెట్టడానికి చరణ్ కూడా మూడు సర్ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఏంటా సర్ప్రైజ్‌లు అంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ‘ఆర్సీ 26’ మూవీ పూజా కార్యక్రమాలతో ఇటీవల ప్రారంభమైంది. ఈ అప్డేట్‌ అందరిలోనూ ఫుల్ జోష్ నింపింది.


అలాగే ఇప్పుడు మరికొన్ని సర్ప్రైజ్‌లతో ట్రిపుల్ ధమాకా ఇచ్చిందుకు చరణ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

Also Read: ఇండియన్ ఫుట్‌బాల్‌ టీంపై హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్

చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో చరణ్ రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. అయితే ఈ మూవీ ఆగిపోయిందని ఈ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇటీవలే ఈ మూవీ తాజా షెడ్యూల్ వైజాగ్‌లో పూర్తి చేసుకుంది. దీంతో ఆ వార్తలకు చెక్ పెట్టినట్టయింది.

ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు. ఇందులో బాగంగానే రామ్ చరణ్ బర్త్ డే రోజు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని జరగండి.. జరగండి అంటూ సాగే సాంగ్‌ను చరణ్ బర్త్ డే రోజున రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలస్తోంది.

కాగా ఈ సాంగ్‌ను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు టాక్ వినిపించింది. కానీ రిలీజ్ చేయలేదు. మరి చరణ్ బర్త్ డేకి రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఈ ఒక్క సాంగ్ కోసం దాదాపు రూ.15 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి.

Also Read: రాజులా ఉండే వాడిని.. ఇప్పుడు బానిస అయ్యాను: స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్

ఇక దీనితో పాటు చరణ్ కెరీర్‌లో 16వ కూడా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ‘ఆర్‌సీ 16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకక్కబోతుంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

గేమ్ ఛేంజర్, ఆర్‌సీ 16తో పాటు అనుకోకుండా మరో ట్రిపుల్ ధమాకా అప్డేట్ కూడా చరణ్‌ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ – రామ్ చరణ్ కాంబో మరోసారి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ చరణ్ బర్త్ డేకి రానున్నట్లు సమాచారం.

‘రంగస్థలం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ కాంబో ఇప్పుడు ‘రంగస్థలం 2 మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి దీని గురించి పూర్తివివరాలు తెలియాలంటే చరణ్ బర్త్ డే వరకు ఆగాల్సిందే.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×