BigTV English

Elephants Fighting: ఊరేగింపులో ఏనుగులు బీభత్సం.. ఫైటింగ్ చేస్తూ పరుగులు

Elephants Fighting: ఊరేగింపులో ఏనుగులు బీభత్సం.. ఫైటింగ్ చేస్తూ పరుగులు
Elephants Fighting
Elephants Fighting

Elephants Fighting: గజరాజులు కొట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా. అది అడవిలోను కాదు.. ఓ ఊరేగింపులో. ప్రజలందరూ చూస్తుండగానే అప్పటి దాకా శాంతంగా ఉన్నా ఏనుగులు ఒక్కసారిగా బీభత్సం సృష్టించాయి. ఉన్నట్టుండి ఏమైందో కానీ ఒకదాని మీదకు ఒకటి దూసుకెళ్లాయి. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది. కేరళలోని తిన్సూర్ జిల్లాలోని అరట్టుపూజ ఆలయంలో ప్రస్తుతం ఉత్సవాలు జరుగుతున్నాయి.


ఉత్సవాల్లో భాగంగా తరతరాలుగా వస్తున్న ఆరాజ్ ఆచార ఊరేగింపును శుక్రవారం రాత్రి జరిపారు. ఈ ఊరేగింపుకు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఉత్సవాలను ఊరేగించేందుకు ఆలయ అధికారులు, సిబ్బంది కలిసి రెండు ఏనుగులను తీసుకువచ్చారు. అనంతరం వాటికి స్నానాలు చేయించి అలంకరించారు. విగ్రహాలను పెట్టి ఊరేగింపుకు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

ఉత్సవాల కోసం తీసుకువచ్చిన గురువాయూర్‌ ఆలయానికి చెందిన ప్రధాన ఏనుగు రవికృష్ణన్‌ ఉన్నట్టుండి వెనుక ఉన్న మరో ఏనుగుపై దాడికి పాల్పడింది. దీంతో ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం గందరగోళంగా మారింది. వెనుక ఉన్న గజరాజుతో కొట్లాటకు దిగింది ఏనుగు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, ఆలయ సిబ్బంది ఏనుగులకు ఆపేందుకు ప్రయత్నించారు. అయినా పెద్ద గజరాజు ఆగకుండా తోటి ఏనుగును కిందపడేసి దొండంతో దాడి చేసింది.


ఈ క్రమంలో మరో ఏనుగు తిరిగి దాడి చేయలేకపోగా పారిపోయేందుకు ప్రయత్నించింది. దీంతో ఏనుగులపై ఉన్న విగ్రహాలు కూడా కిందపడిపోయాయి. అంతేకాదు అంతటితో ఆగని గజరాజు మరో గజరాజును వెంబడిస్తూ తరుముకుంటూ వెళ్లింది. దీంతో చుట్టూ నిలబడి ఉన్న జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఏనుగులు సృష్టించిన బీభత్సంతో ప్రజలు పరుగులు పెట్టారు. అయితే ఏనుగులు ఒక్కసారిగా స్థానికుల మీదకు దూసుకురావడంతో జనాలు చెల్లాచెదురుగా పరుగుతు తీశారు. ఈ క్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో వెలుగుచూసింది.

అయితే ఈ ఘటనను అదుపులోకి తీసుకువచ్చేందుకు స్థానికులు, ఆలయ అధికారులు ఫారెస్ట్ సిబ్బంది, ఎలిఫెంట్ స్వ్కాడ్ కు వెంటనే సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న ఎలిఫెంట్ స్వ్కాడ్ సాహసాలు చేసి మరి రెండు ఏనుగులను పట్టుకుని శాంతిపరిచాయి. కాగా, ఈ ఘటనతో అక్కడి స్థానికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×