Gundeninda GudiGantalu Today episode November 21th: నిన్నటి ఎపిసోడ్ లో.. దీపావళి సందర్బంగా ఇంట్లో షీలా హడావిడి చేస్తుంది. బాలు విషయంలో తోచినట్లు మాట్లాడుతుంది. మీ మనవడు చూడటానికి కోపంగా ఉన్నా కూడా చాలా మంచోడు అని అంటుంది. ఇక పండగ పూట నూనెతో తలంటుకొని స్నానం చేస్తే కుళ్ళు మొత్తం పోతుంది అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రభావతిపై పంచులు వేస్తుంది షీలా డార్లింగ్. వెంటనే బాలు రియాక్ట్ అవుతు మనోజ్ గాడికి పెట్టు.. వాడి కుళ్ళు మొత్తం పోవాలి అంటాడు. దీంతో పక్కనే ఉన్న సత్యం పండగ కూడా గొడవలేంట్రా చిన్న పిల్లలా అని మందలిస్తాడు. చిన్నపిల్లలు అంటే గుర్తొచ్చింది చిన్నోడు ఎక్కడ ఉన్నాడ్రా.. వాడు కనిపించట్లేదు అంటూ బామ్మ అడుగుతుంది. ఇంట్లో పూజ అయ్యాక రవికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని సుశీలమ్మ ఫోన్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు నానమ్మను కారులో గుడికి తీసుకొని వెళ్లాలని కారు ఓనర్ గణపతి దగ్గరకు వెళ్తాడు. కారుకు డబ్బులు తీసుకొని మళ్లీ మళ్లీ మీ దగ్గరకు రావడం తప్పే.. నా పరిస్థితి బాగోలేక మా నాన్న ఆరోగ్యం కోసం అమ్మేసాను. అది మా నాన్నమ్మకు తెలియదు. రెండు నిమిషాలు అక్కడకు వెళ్లి వస్తావా అని అడిగితే కాదు సార్ రెండు గంటలు వెళ్లి వస్తాను అంటాడు. ఓనర్ షాక్ అవుతాడు. బాలు ఫీలింగ్ అర్థం చేసుకున్న.. ఆ వ్యక్తి కారు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. కానీ తాను కూడా వస్తానని చెబుతాడు.దీంతో వెంటనే బాలు.. ఇంటికి వచ్చి గుడికి వెళ్దాం అంటూ హడావిడి చేస్తాడు. దీంతో తన బామ్మ అంతా ఆగ పడుతున్నావేంట్రా.. మన కారే కదా.. వెళ్దాంలే ఫస్ట్ నీ భార్య రెడీ అయిందా? లేదా? అది తెలుసుకోమని చెబుతుంది..
ఇక సత్యం అక్కడికి వస్తాడు. మీనాను తీసుకు రమ్మని క్లాస్ పీకుతాడు. దానికి మీనా దగ్గరకు వెళ్తాడు బాలు. అప్పుడు మీనా గాజులు వేసుకోవాలని చూస్తుంది. ఆ గాజులు నీ కోసం కొన్నవి కాదు. మా అమ్మకు కొన్నవి అంటాడు. మన రూంలో ఉంటే అవి నాకోసం కొన్నవే కదా అని వాటిని వేసుకుంటుంది. కిందకు వస్తుంది. ఇక బాలు మాత్రం పంచ కట్టుకొని కిందకు వస్తాడు. అలా అందరు కలిసి గుడికి వెళ్తారు. కారులో వెళ్లే సమయంలో మీనా అనుకోకుండా బాలుపై పడుతుంది. దీంతో బాలు చిరాకు పడతాడు. ఆ విషయాన్ని గమనించిన శీల డార్లింగ్.. పడింది నీ పెళ్లామే కాదా ఎందుకీ గొడవ. ఈ గొడవలు పక్కన పెట్టి.. తనకు సంవత్సరం తిరిగే లోపు పండంటి మగ పిల్లల్ని ఇవ్వాలని చెబుతుంది. గుడికి తీసుకెళ్లాక బాలుకి ట్విస్ట్ ఇస్తుంది మీనా.
మా మామయ్య ఆరోగ్యం బాగుంటే మీతో గుడి మొత్తం పొర్లు దండాలు పెట్టిస్తాను అని మొక్కుకున్న అన్నాను అంటుంది. ఇలా తన నాన్న పేరు చెప్పి బాలుతో పొర్లు దండాలు పెట్టిస్తుంది. దీంతో బాలు కి చుక్కలు కనిపిస్తాయి. నమ్మకద్రోహం చేసావ్ అని మీనాపై కొప్పాడుతాడు బాలు. పక్కనే ఉన్న శీలా డార్లింగ్.. ‘మీ తాతయ్య కోసం మీ నాన్న చేశాడు. ఇప్పుడు మీ నాన్న కోసం నువ్వు చేసావు. ఇందులో తప్ప ఏముందంటూ షాక్ ఇస్తుంది. నాన్న మీద బాలుకు చాలా ప్రేమ ఉందని అనుకుంటుంది. రవి చాలా హ్యాపీగా ఉంటాడు. శృతి ఇంటికి రాగానే రవి సంతోషంతో ఎత్తుకుని తిప్పుతాడు. తనకు తన భామ నుండి ఫోన్ వచ్చిందని, తనని ఇంటికి రమ్మని పిలుస్తున్నారని చెబుతాడు రవి. కానీ, మీ బామ్మకు అసలు విషయం తెలియదు కావచ్చు. అందుకే పిలిచిందని ఏదో సందేహపడుతుంది శృతి. రవి మాత్రం తన బామ్మ అందరినీ కన్వెన్షన్ చేసి.. తనకు కాల్ చేసిందని చెబుతాడు. అయితే.. తాను కూడా వస్తానని చెబుతుంది. ఇప్పుడు వద్దు పరిస్థితులను బట్టి నిన్ను తీసుకొని వెళ్తాను అని అంటాడు రవి..
ఇక పండుగ పూట అన్ని పనులు తాను ఒక్కదాన్నే పనులు చేసుకోవాలని అంటూ ప్రభావతి ఇంట్లో అరుస్తుంది. ఇంతలోనే తన అత్తమ్మ వచ్చింది. ఏం చేస్తున్నావు..ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ ప్రశ్నిస్తుంది. ఈ సమయంలో మీనా వంటింట్లోకి వస్తుంది. అత్త మీది కోసం మీనా మీద తీయాలని.. ఇంట్లో పనులు పెట్టుకుని.. ఎక్కడికి వెళ్లావు ? అని ప్రశ్నిస్తుంది. తాను బామ్మతో గుడికి వెళ్లానని చెబుతోంది. గుడికి వెళ్తే.. ఇంట్లో ఉన్న పనులు ఎవరు చేయాలి అని అడుగుతుంది. దానికి సుశీల వచ్చి ప్రభావతి పై నోరు పారేసుకుంటుంది. ఇంట్లో మిగతా ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంది. అయినా పండగపూట ఇంటికి పెద్ద కోడలు వంట చేయాలి. అదే మన సాంప్రదాయం అంటూ రోహినీ నీ పిలుస్తుంది. ‘రోహిణికి వంట చేయడం రాదని, అయినా తనకు ఇలాంటివి తెలియదని చెబుతుంది ప్రభావతి..
పెళ్ళైన కొత్తల్లో నీకేమైన తెలుసా టీ పెట్టడం కూడా రాదు.. నేనే దగ్గరుండి నేర్పించాను కదా అని అంటుంది. నువ్వు నీ కోడలికి నేర్పించు అని అంటుంది. ఒకసారి తప్పు చేస్తారు. మరోసారి నేర్చుకుంటారు.’ వెంటనే వెళ్లి రోహిణి తీసుకొని రమ్మని ప్రభావతికి ఆర్డర్ వేస్తుంది. దీంతో ప్రభావతి.. భయపడుతూ రోహిణి దగ్గరికి వెళ్తుంది. పండగ పూట మొదటి వంట నువ్వే చేయాలని రోహిణినీ రిక్వెస్ట్ చేస్తుంది ప్రభావతి. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో పార్వతమ్మ ఇంటికి వస్తుంది. మరి రోహిణి గురించి అసలు నిజాన్ని బయట పెడితుందేమో చూడాలి..