Prashanth Neel.. కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ఇక తర్వాత ప్రభాస్ తో ‘సలార్’ సినిమా చేసి ఆడియన్స్ కు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR) తో ‘డ్రాగన్’, ప్రభాస్ (Prabhas) తో ‘సలార్ 2’ సినిమా చేస్తున్న ఈయన.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, ఆ డైరెక్టర్స్ అంతా బ్యాడ్ డైరెక్టర్స్ అంటూ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం. అన్నపూర్ణ ఫిలిమ్స్ స్కూల్లో విద్యార్థుల కోసం అక్కినేని అమల (Akkineni Amala) ఇటీవల ఒక కార్యక్రమం నిర్వహించగా.. అందులో ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. పాత ముచ్చట్లు, తన ఆలోచనలు కూడా పంచుకున్నారు.
వారంతా బ్యాడ్ డైరెక్టర్స్ – ప్రశాంత్ నీల్
ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ” సినిమా చూడడం చాలా తేలికైన పని. కానీ సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో.. ‘ఉగ్రం’ సినిమా షూటింగ్ అయిన తర్వాతే నాకు తెలిసింది.వాస్తవానికి నా మొదటి చిత్రం షూటింగ్ ప్రారంభం కాకముందు.. అప్పటి వరకు సినిమాలు తీసిన డైరెక్టర్స్ అందరూ కూడా బ్యాడ్ డైరెక్టర్స్ అని అనుకునేవాన్ని. అందుకే ఇండస్ట్రీలో మార్పు మనమే తీసుకురావాలి అని కూడా అనుకునేవాడిని. కానీ సినిమా మేకింగ్ ఎంత కష్టమో ఉగ్రం సినిమా కొంత భాగం చిత్రీకరణ పూర్తయ్యాకే నాకు అర్థం అయింది. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమాను ఒక పది మంది చూసినా చాలు అనిపించింది. ఎవరికైనా సరే ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.. అది కావాలంటే కచ్చితంగా దర్శకుడు టీంలో పని చేయాల్సిందే. అంతే కానీ క్రియేటివిటీ ఆలోచనలతో సినిమా చేస్తే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. నేను చేసిన తప్పుల నుండి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను.
మొదటి అనుభవం ఎన్నో నేర్పించింది – ప్రశాంత్ నీల్..
ముఖ్యంగా నేను మొదటి సినిమా ఉగ్రంకు దర్శకత్వం వహించిన తర్వాత ఆ అనుభవం నాకు నా తదుపరి పాన్ ఇండియా సినిమా మేకింగ్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడింది” అంటూ ప్రశాంత్ నీల్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా అనుభవం పూర్వకంగానే కష్టం విలువ తెలుస్తుంది అంటూ పలువురు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కే జి ఎఫ్ 1&2 చిత్రాలను చూస్తే ఆయన ఇంప్రూవ్మెంట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే.. 1980 జూన్ 4న కర్ణాటకలో జన్మించిన ఈయన.. ‘ఉగ్రం’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 2014 నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన.. ఇప్పటివరకు కేవలం కొన్ని చిత్రాలే చేసిన ఆ చిత్రాలతో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక లిఖిత రెడ్డి అనే ఆమెను వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇకపోతే ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ తో పాటు సైమా అవార్డు కూడా అందుకున్నారు. ఇక కేజీఎఫ్ 1 చిత్రం కోసం ఫిలిం బీట్ అవార్డుతో పాటు సిటీ సినీ అవార్డు, జీ కన్నడ అవార్డు, సైమా అవార్డు కూడా లభించింది.