BigTV Exclusive: లేడీ అఘోరీ గురించి ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెల్సిందే. అయితే ఈ ఆడియోకు సంబంధించి గుంటూరుకు చెందిన హిందూ ఐక్య పోరాట వేదిక నాయకుడు అనిల్ బెహరా స్పందించారు. గుంటూరులో బిగ్ టీవీతో అనిల్ బెహరా మాట్లాడుతూ లేడీ అఘోరీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఇలాంటి వారిని హిందూ ధార్మిక సంఘాలు అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బెహరా విమర్శించడం విశేషం.
రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్దగా పరిచయం అక్కర్లేని లేడీ అఘోరీ అందరికీ తెలుసు. కారణం సోషల్ మీడియా వేదికగా ఈమెపై సాగిన ప్రచారాలు కూడా అన్నీ ఇన్నీ కావు. ముత్యాలమ్మ ఆలయంపై దాడి సమయంలో వెలుగులోకి వచ్చిన లేడీ అఘోరీ, సనాతనధర్మ పరిరక్షణ తన భాద్యత అంటూ ప్రకటించారు. అలా తెలంగాణలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే పలు ఛానల్స్ కి పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. అంతవరకు ఓకే ఈ లేడీ అఘోరీ వస్త్రధారణ పాటించక పోవడంతో, పలు చోట్ల వివాదాలు సైతం సాగాయి. కార్తీకమాసంలో వైజాగ్ పర్యటనకు వెళ్ళిన అఘోరీ మాతకు అక్కడి గురువులు వస్త్రధారణ పాటించాలని, సమాజంలో తిరిగే సమయంలో తప్పక పాటించాలని సూచిస్తూ అక్కడే వస్త్రధారణ పాటించేలా చొరవ చూపారు. మళ్లీ పలు ఆలయాల సందర్శనకు వెళ్లిన సమయంలో వస్త్రధారణ పాటించక పోవడంతో పలు చోట్ల వివాదాలు చుట్టుముట్టాయి.
అయితే నిరంతరం ఏదొక రూపంలో వార్తల్లో నిలవడం లేడీ అఘోరీ వంతుగా మారింది. వేములవాడలో దర్గాను కూల్చి వేస్తానని, అలాగే మహిళలపై దాడికి పాల్పడ్డ వ్యక్తిపై దాడి చేయబోతున్నట్లు, ఇలా ఎన్నో సంచలన ప్రకటనలు చేసి అఘోరీ వార్తల్లో నిలిచారు. తాజాగా మరో కొత్త వివాదంలో అఘోరీ చిక్కుకున్నారని చెప్పవచ్చు. ఇటీవల తణుకు వెళ్లిన అఘోరీ. అక్కడ అఘోరీ రాజేష్ నాథ్ ఆశ్రమం వద్ద అఘోరీ బైఠాయించి ఓ యువతికి మద్దతు పలికారు. ఆ యువతి ఏకంగా సోషల్ మీడియాలో రాజేష్ నాథ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఆ సమయంలో తణుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అఘోరీ, తన వద్ద పెట్రోల్ క్యాన్ ఓపెన్ చేసి నిప్పంటించుకొనే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు ఆమెను వారించారు. ఆ ఎపిసోడ్ అలా ముగియగానే, అఘోరీ తన మకాం గుంటూరుకు మార్చింది. గుంటూరుకు చెందిన అనిల్ బెహరా ఎన్నో ఏళ్లుగా హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏ వివాదం ఉందో తెలియదు కానీ, అఘోరీ గుంటూరుకు వచ్చి బెహరా ఇంటి ముందు బైఠాయించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని నల్లపాడు పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించి అఘోరీకి కౌన్సిలింగ్ నిర్వహించారు.
సంచలనం సృష్టించిన ఆడియో..
లేడీ అఘోరీకి సంబంధించి ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ యువతితో అఘోరీ మాట్లాడుతున్న సంభాషణ వైరల్ కావడంతో అసలు అఘోరీ లక్ష్యం ఏమిటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ యువతి మాత్రం ఇప్పటికిప్పుడు రావాలని, తన కళ్ల ముందు కనిపించాలని ప్రాధేయ పడడం విశేషం. మరి ఈ ఆడియో ఎంత వరకు నిజమో కానీ లేడీ అఘోరీ ధృవీకరించాల్సి ఉంది. మొత్తం మీద రెండు రోజులుగా లేడీ అఘోరీ ఏదొక రూపంలో వార్తల్లో నిలుస్తున్నారు.
లేడీ అఘోరీ కాదు శీను అనే పిలవండి
గుంటూరుకు చెందిన అనిల్ బెహరా బిగ్ టీవీతో మాట్లాడుతూ అఘోరీపై పలు సంచలన కామెంట్స్ చేశారు. తనకు అఘోరీకి గల విభేదాల గురించి వివరించారు. ముందు లేడీ అఘోరీ ఎవరూ పిలవద్దని బెహరా కోరారు. కేవలం శీను మాత్రమేనని, తనకు సంబంధించి అన్ని రుజువులు తన వద్ద ఉన్నాయని సంచలన ప్రకటన చేశారు. కేవలం అవయవాలు మార్పిడి మాత్రమే జరిగిందని, ట్రాన్స్ జెండర్ కాదన్నారు. అఘోరీ ఆడియో కాల్ వైరల్ అవుతున్న ఆడియోలో, మాట్లాడుతున్న యువతి సోదరుడు అని చెప్పుకుంటున్న వ్యక్తికి నేర చరిత్ర ఉందన్నారు.
Also Read: TTD Update: శ్రీవారి భక్తులకు శుభవార్త.. అన్నప్రసాదం మెనూ మారింది
కేవలం మీడియా స్టంట్ కోసం అఘోరీ రోజుకొక విషయాన్ని లేవనెత్తుతున్నట్లు ఆరోపించారు. హిందుత్వాన్ని అడ్డుపెట్టుకొని సోషల్ మీడియా మార్కెటింగ్ చేయడం శీనుకు అలవాటుగా మారిందని, యూట్యూబ్ ద్వారా కూడా ఆదాయం పొందుతున్నాడన్నారు. ఫారిన్ నుండి నిధులు అఘోరీకి వస్తున్నాయని, లేకుంటే ఇంత లగ్జరీ బ్రతుకు ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి వారిని ఎవరూ ప్రోత్సహించవద్దని, పోలీసులను దుర్భాషలాడుతున్న పోలీసులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సనాతన ధర్మానికి పట్టిన చీడపురుగు శీను అలియాస్ లేడీ అఘోరీ అని, ఇప్పటికైనా అతనిని కట్టడి చేయాలని కోరారు. 1997 నుండి హిందూ ధర్మం కోసం పోరాడుతున్నామని, తమకు అప్పులు, కేసులు మిగిలాయని, కానీ అఘోరీకి ఎక్కడి నుండి నిధులు వస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.