BigTV English

Deepika Padukone: ప్రెగ్నెంట్ అయ్యి కూడా ఆ పని చేస్తున్నావంటే.. సాహసమనే చెప్పాలి

Deepika Padukone: ప్రెగ్నెంట్ అయ్యి కూడా ఆ పని చేస్తున్నావంటే.. సాహసమనే చెప్పాలి

Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ మధ్యనే తాను ప్రెగ్నెంట్ కాబోతున్నాను అని ప్రకటించిన విషయం తెల్సిందే. హీరో రణ్వీర్ సింగ్ – దీపికా ప్రేమించుకొని 2018 లో వివాహం చేసుకున్నారు. దాదాపు ఐదేళ్ల తరువాత వీరు తమ మొదటి బిడ్డకోసం ప్లాన్ చేస్తున్నారు. ఇక దీపికా ప్రెగ్నెంట్ గా ఉంది అంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటున్నారేమో.. అస్సలు కాదు.. ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఉండి కూడా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది. అది కూడా అలాంటి ఇలాంటి సినిమా కాదు.. యాక్షన్ సినిమా.


ప్రస్తుతం దీపికా సింగం ఎగైన్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ శక్తి శెట్టిగా దీపికా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెట్స్ లో దీపికా అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పోలీస్ డ్రెస్ లో దీపికా కనిపించింది. ఇక బేబీ బంప్ తో ఆమె యాక్షన్ సన్నివేశాలు చేయడం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో రిస్క్ ఎందుకు.. రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.


ఇక దీపికా కూడా అలియానే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అలియా కూడా ప్రెగ్నెంట్ అయినా కూడా షూటింగ్ చేసింది. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ.. నేను మరి అంత నీరసంగా లేను. మూడు, నాలుగు నెలలు అప్పుడే రెస్ట్ తీసుకోవడానికి వీక్ గా లేను. నాకు ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు దీపికా కూడా అదే పద్దతిని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ లేడీ సింగం.. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×