Big Stories

Note For Vote Case: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ.. టీడీపీ నేతల్లో ఉత్కంఠ!

Supreme court on note for vote case(AP political news): ఎన్నికల వేల టీడీపీ నేతల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గురువారం సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసులో విచారణ జరగనుంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని టీటీడీ నేతల్లో ఆందోళనల మొదలైంది.

- Advertisement -

గతంలో రెండు తెలుగు రాష్ట్రాలను ఓటుకు నోటు కేసు షేక్ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి రేపు సుప్రీంకోర్టుల విచారణ జరగునుంది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి 2017లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -
Supreme Court Probe Cash For Vote Case
Supreme Court Probe Cash For Vote Case

ఈ పిటిషన్ లో గతంలో ఈ కేసును విచారించిన ఏసీబీని తొలగించి దాని స్థానంలో కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో గతంలో పలు మార్పు ఈ కేసును సుప్రీంకోర్టు విచారించగా.. తీర్పు వాయిదా పడుతూ వచ్చింది.

గతంలో ఈకేసు విచారణలో భాగంగా చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూత్రా కేసును మరికొన్ని రోజులు వాయిదా వేయాలని కోరారు. దీంతో టీడీపీ అభ్యర్థన మేరకు కేసును వాయిదా వేయగా.. రేపు జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం దీన్ని విచారించనుంది.

గతంలో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీడీపీ డబ్బు ముట్టజెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో చంద్రబాబు నేరుగా స్టీఫెన్ తో ఫోన్ లో మాట్లాడినట్లు ఓ ఆడియోను విడుదలై సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో ఈ కేసుపై అప్పట్లో టీఆర్ఎస్, వైసీపీకి తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశాయి. కాగా, ఈ కేసును సుప్రీంకోర్టు రేపు విచారించనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News