BigTV English

Chandrababu: సీఎం జగన్ నవరత్నాలు పేరుతో.. నవ మోసాలు చేశాడు: చంద్రబాబు

Chandrababu: సీఎం జగన్ నవరత్నాలు పేరుతో.. నవ మోసాలు చేశాడు: చంద్రబాబు

Chandrababu Comments On CM Jagan(Andhra politics news): సీఎం జగన్ అధికారం చేపట్టిన నుంచి ప్రజలను మోసం చేస్తూనే వచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ఐదేళ్లలో నవరత్నాల పేరిట.. నవ మోసాలకు పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జిల్లాలో జరిగిన టీడీపీ-జనసేన కూటమి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటుగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


వైసీపీ పాలనలో రాష్ట్రం పరిస్థితి అధ్వాన స్థితికి చేరుకుందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. అధికార పార్టీ నేతలు దోచుకోవడానికే ఆసక్తి చూపించారని ఆరోపించారు. ఇసుక క్వారీలు, అక్రమ మద్యం, ప్రభుత్వ భూముల స్వాధీనం చేసుకుని వారి ఆదాయాన్ని భారీగా పెచుంకున్నారని మండిపడ్డారు.

Chandrababu Comments On CM Jagan


దోపిడీ దారులకు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం లేదని చంద్రబాబు ప్రజలకు వెల్లడించారు. ఆదాయం పెరిగితేనే ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన సాధ్యం అవుతుందన్నారు.

నీతికి, నిజాయితీకి, అభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రజలకు చంద్రబాబు మాట ఇచ్చారు. ఇప్పటికి వరకు వెలువడిన సర్వేలన్నీ కూటమికే అనుకూలంగా వచ్చాయని.. వైసీపీ ఓటమి తప్పదని వెల్లడించాయని తెలిపారు.

Also Read: జగన్ భయపడేలా కూటమికి మెజారిటీ ఇవ్వాలి: పవన్ కళ్యాణ్

వైఎస్సార్ మరణం, వివేకానంద రెడ్డి హత్య నుంచి ప్రస్తుతం పెన్షన్ దారుల శవాలతో జగన్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు శవ రాజకీయాలు చేస్తున్నారాని ఆరోపించారు. ఎన్నికల్లో అలాంటి శవ రాజకీయాలు చేసే జగన్ కు బుద్ధి చెప్పాలని చంద్రబాబు ప్రజలను కోరారు.

Related News

AP Govt Schemes: ఏపీకి స్పెషల్ అవార్డు.. దీని వెనుక అసలు కథ ఇదే!

Chandra Grahanam 2025: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..!

Turakapalem mystery: ఆ ఊరికేమైంది? 20 మరణాల మిస్టరీ ఏమిటి? రంగంలోకి సీఎం..!

Chandrababu: చంద్రబాబుకి అమరావతికంటే ఇష్టమైన ప్రదేశం ఏంటి?

AP Assembly 2025: 18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ వచ్చేనా?

AP Fact Check: సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు హెలికాప్టర్ హంగామా… వాస్తవం ఏంటో తెలుసా?

Big Stories

×