Priya Prakash Varrier: ..ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్ను గీటి కర్ర కారును ఊపేసిన ఈమె, ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈమె ఫేమస్ అయిన అంత ఈజీగా కెరియర్ ను నిలబెట్టుకోలేకపోయింది. తెలుగు, మలయాళం సినిమాలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక తెలుగులో చేసిన చాలా సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా ఎంత వేగంగా అయితే ఫేమస్ అయిందో అంతే వేగంగా కెరియర్ డౌన్ అయిపోయింది. సౌత్ లో కూడా పెద్దగా ఆఫర్లు రావడం లేదు. అయినా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
అవకాశాలు లేవు కానీ అలాంటి పని చేస్తున్నా – ప్రియా ప్రకాష్..
ముఖ్యంగా మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న ఈమెకు గుర్తింపు రావడానికి అదే కారణం అవుతోంది. ఇకపోతే తనకు సినిమా అవకాశాలు రాకపోవడం పై ఓపెన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. “చాలా రోజులుగా నాకు అవకాశాలు రావట్లేదు. ఎవరు కూడా ఇవ్వడం లేదు .కానీ సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ సంపాదిస్తున్నాను. అలా వచ్చిన డబ్బులతోనే సర్వైవ్ అవుతున్నాను. నాకు ఛాన్సులు రాకపోయినా బాధ లేదు. కానీ నాకు టైం వచ్చినప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాను” అంటూ ప్రియా ప్రకాష్ వారియర్ తెలిపింది. మొత్తానికి అయితే అవకాశాలు లేకపోయేసరికి సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
అవకాశాలు వచ్చినా అదృష్టం లేదా..
ప్రియా ప్రకాష్ వారియర్ కెరియర్ లో సినిమా కథల ఎంపిక విషయంలో కాస్త వెనుకబడింది. ముఖ్యంగా తెలుగులో ఆమె చేసినవి చిన్న సినిమాలే అయినా అందులో హిట్ పర్సంటేజ్ ఎక్కువగా లేదు. ఒకవేళ ఆ సినిమాలే మంచి విజయాన్ని సాధించి ఉంటే మాత్రం ఈమెకు క్రేజ్ మరింత పెరిగేది. దీనికి తోడు అవకాశాలు వచ్చినా మరొకవైపు అదృష్టం కలిసి రావడం లేదు. అందుకే సినిమా అవకాశాలు రాక ఇప్పుడు ఇబ్బంది పడుతోంది ఈ ముద్దుగుమ్మ. కనీసం ఇకనైనా ఈమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.
ALSO READ:Prabhas New Movie : నా కండీషన్స్ ఒప్పుకో.. లేకపోతే సినిమా చేయ్యను… ప్రభాస్‌కు డైరెక్టర్ వార్నింగ్..!
ప్రియా ప్రకాష్ కెరియర్..
2018లో ‘తనహా’ అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. ‘ఓరు ఆధార్ లవ్’ అనే సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. ఇక తర్వాత తెలుగులో ‘చెక్’ అనే సినిమా చేసిన ఈమె ఇష్క్ లో కూడా నటించింది. ఇక తెలుగులో చివరిగా ‘బ్రో’ అనే సినిమాలో నటించిన ఈమె మలయాళం, కన్నడ చిత్రాలలో కూడా నటించింది. అంతేకాదు ప్రస్తుతం హిందీలో లవ్ హ్యాకర్స్, త్రీ మంకీస్ అనే సినిమాలలో నటిస్తోంది. కానీ ఆ సినిమా అప్డేట్స్ లేకపోవడం గమనార్హం. మరి ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పుడేమో అవకాశాలు లేక సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ కెరియర్ కొనసాగిస్తూ ఉండడం పై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం తెలిసి తమ అభిమాన హీరోయిన్ కి ఎంత కష్టం వచ్చిందో అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం