BigTV English
Advertisement

Arjun S/O Vyjayanthi: టైటిలే విలన్ అయితే.. కళ్యాణ్ రామ్ మూవీకి అలానే ఉంది మరి.!

Arjun S/O Vyjayanthi: టైటిలే విలన్ అయితే.. కళ్యాణ్ రామ్ మూవీకి అలానే ఉంది మరి.!

Arjun S/O Vyjayanthi: సినిమాలపై బజ్ క్రియేట్ అవ్వడానికి టైటిల్స్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉంటే ముందుగానే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కానీ కొన్ని టైటిల్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వకపోవడం వల్ల మేకర్స్ దానిపై బజ్ క్రియేట్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. అయితే తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌కు కూడా అదే పరిస్థితి ఎదురయ్యేలా అనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న నందమూరి హీరోల్లో కళ్యాణ్ రామ్ మాత్రమే ఒక్క హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇక తర్వాతి మూవీ ఎలాగైనా హిట్ అవ్వాలనే ఫిక్స్ అయిన కళ్యాణ్ రామ్.. కొత్త కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ మూవీకి టైటిలే విలన్ అయ్యేలా ఉందని ఇండస్ట్రీ నిపుణులు సైతం భావిస్తున్నారు.


రంగంలోకి విజయశాంతి

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నందమూరి హీరోల్లో ఎన్‌టీఆర్, బాలకృష్ణ మంచి ఫామ్‌లో ఉన్నారు. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారు ఏ సినిమాలో నటించినా కూడా అవి హిట్లుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఎన్‌టీఆర్ అయితే గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రమే ఒక్క హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. తను నటించిన ఒక్క సినిమా హిట్ అయితే.. మరో నాలుగు ఫ్లాప్ అవుతున్నాయి. అందుకే తన కెరీర్‌లో 21వ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని ఫస్ట్ లుక్ నుండే ప్రమోషన్స్ మొదలుపెట్టాడు ఈ హీరో. ఈ మూవీలో కీ రోల్ ప్లే చేయడానికి అలనాటి నటి విజయశాంతిని రంగంలోకి దించాడు. ముఖ్యంగా టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్‌గా పెట్టడానికే ట్రై చేశారు.


క్లాసిక్ క్యారెక్టర్

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కెరీర్‌లో 21వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాకు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన కళ్యాణ్ రామ్‌తో పాటు విజయశాంతి ఫస్ట్ లుక్ కూడా తాజాగా విడుదలయ్యింది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో విజయశాంతి కనిపించడంతో సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఒకప్పుడు వైజయంతి అనే పోలీస్ పాత్రలో విజయశాంతి కనిపించారు. ఆ పాత్రను ఇప్పటివరకు ప్రేక్షకులు మర్చిపోలేదు. అందుకే అదే పాత్రను మళ్లీ గుర్తుచేసేలా టైటిల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఆ టైటిల్ పాత చింతకాయ పచ్చడి లాగా ఉంది అంటూ చాలామంది ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

Also Read: 25 రోజుల కష్టం.. పక్కన పడేశారు.. ‘గేమ్ ఛేంజర్‌’పై నటుడి సంచలన కామెంట్

ప్రేక్షకులకు నచ్చుతుందా.?

ఈ జెనరేషన్‌లో ఉన్న చాలామంది ప్రేక్షకులు ట్రెండీ టైటిల్స్‌తో ఉన్న సినిమాలే చూస్తున్నారు. అలాంటిది ‘అర్జున్ సన్నాఫ్ విజయశాంతి’ అనేది చాలా ఔట్‌డేటెడ్ టైటిల్. ఈ టైటిల్‌తో ఈరోజుల్లో సినిమా వస్తే అసలు ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ వస్తుందా అని కొందరిలో అనుమానాలు మొదలయ్యాయి. విజయశాంతి లాంటి పోలీస్ పాత్రలో కనిపిస్తుందంటే ఒకప్పటి ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్‌గానే చూస్తారు. కానీ ఈరోజుల్లో ప్రేక్షకులకు విజయశాంతి (Vijayashanthi) రీఎంట్రీ పెద్ద విషయం కాకపోవచ్చు. అందుకే తన పాత్రకు కనెక్ట్ అయ్యేలా కాకుండా మరో క్యాచీ టైటిల్‌తో ఈ మూవీ విడుదలయితే బాగుంటుందని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×