BigTV English

Vallabhaneni Vamsi : వంశీని ముంచిన ఓవర్ యాక్షన్ – అసలు కేసు పాయే, కొసరు కేసులో జైలుకు పోయే

Vallabhaneni Vamsi : వంశీని ముంచిన ఓవర్ యాక్షన్ – అసలు కేసు పాయే, కొసరు కేసులో జైలుకు పోయే

Vallabhaneni Vamsi : వైసీపీ ముఖ్య నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు మరో రెండు వారాలు రిమాండ్ పొడిగించింది. ఇప్పటికే జైలులో ఉన్న వంశీ రిమాండ్ ముగుస్తుండటంతో పోలీసులు వర్చువల్ గా కోర్టుకు హాజరు పరచారు. వంశీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని, అతన్ని బయటకు వదిలితే బాధితుల్ని భయపెడతాడంటూ పోలీసులు మరింత రిమాండ్ కోరారు. దీంతో మెజిస్ట్రేట్ ఈనెల 25 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


అధికారం ఉన్నప్పుడు వ్యవహరించినట్లే అధికారంలో లేనప్పుడు కూడా చేస్తే ఎవరూ ఊరుకుంటారు. తీసుకెళ్లి ఏ తీరుగా సన్మానం చేయాలో ఆ తీరుగా చేస్తారు. ఈ విషయం మరింత స్పష్టంగా అర్థం కావాలంటే.. వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసుని ఓసారి పరిశీలించాల్సిందే. ప్రస్తుతం వంశీ జైలు శిక్ష అనుభవిస్తున్న కేసును పరిశీలిస్తే… గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకున్న క్రెడిట్ వంశీకే తగ్గుతుంది. తన అతి ఆలోచనలు, వ్యవహారమే.. జైలులో చిప్పకూడు తినేలా చేస్తోందంటున్నారు.  కూటమి ప్రభుత్వం కక్ష కట్టి కేసు పెట్టిందని వంశీ వర్గం, వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నా… ప్రభుత్వం చేసినదాని కంటే వంశీ చేసిన తప్పిదం వల్లే జైలుకు వెళ్లాడనేది రాజకీయ విశ్లేషకులు వాదన. మరి ఇంతకీ.. వంశీ చేసిన తప్పేంటో తెలుసా.?

అసలు కేసు ఏంటి.?


వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం పై 2021 అక్టోబర్ 19న వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. ప్రధాన గేటుని ధ్వంసం చేసుకునే లోపలికి వెళ్లిన వైసీపీ శ్రేణులు.. కేంద్ర కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు అక్కడ విధ్వంసం సృష్టించారు. ఈ కేసులో 31 మంది నిందితులుగా చేసిన పోలీసులు ప్రధాన సూత్రధారిగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ పేరు చేర్చారు. అయితే ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే వంశీ చేసిన తొందరపాటు చర్య వల్ల ఇప్పుడు జైలులో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది.

వంశీ ఇరుక్కుపోయింది ఇక్కడే..

వాస్తవానికి కోర్టు తీర్పు వెలువరించే వరకు పోలీసుల అరెస్ట్ నుంచి వంశీకి రక్షణ ఉంటుంది. కానీ కుట్రపూరితంగా అసలు ఆ కేసునే లేకుండా చేయాలని ఉద్దేశంతో.. ఏకంగా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఫిర్యాదుదారున్ని టార్గెట్ చేసుకున్నారు. సత్య వర్ధన్ అనే ఆ వ్యక్తిని బెదిరించి, భయపెట్టి, కిడ్నాప్ చేసిన వంశీ అనుచరులు.. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసును ఉపసంహరించుకునేలా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసారు. అయితే.. అతన్ని బెదిరిస్తున్న దృశ్యాలు సీసీ కెెమెరాల్లో రికార్డు అయ్యాయి. దాంతో.. వంశీ తప్పించుకునే వీల్లేకుండా పోయింది.

హైకోర్టులో టీడీపీ కార్యాలయం పై కేసు పెండింగ్లో ఉండగానే.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేశారని మరో కేసు వంశీ పై నమోదయింది. ఈ కేసు విచారణలో భాగంగానే వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. ఆ రిమాండ్ కాస్త ఇప్పుడు మరోసారి పొడిగించింది విజయవాడలోని కోర్టు.  దీంతో మరో రెండు వారాల వరకు వంశీ కటకటాల్లోనే గడపాల్సిన పరిస్థితి.

వాస్తవానికి వంశీ టీడీపీ పార్టీలోనే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగాడు. ఆ పార్టీలోనే వివిధ స్థాయిలో పనిచేస్తూ రాజకీయ గుర్తింపు సాధించారు. అలాంటి వ్యక్తి 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ టికెట్ పై గెలిచి, ఆ తర్వాత వైసీపీ లోకి జంప్ కొట్టారు. అక్కడ సైలెంట్ గా ఉండకుండా తెదేపా నాయకులే లక్ష్యంగా విపరీతమైన వ్యాఖ్యలు చేశారు.0 ఏకంగా అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు భార్యను ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ విషయంలో టీడీపీ శ్రేణుల నుంచి విపరీతమైన వ్యతిరేకత ఉంది.

టీడీపీ శ్రేణుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు తీవ్ర ఆగ్రహంతో ఉండడం.. ఓ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి మరో కేసులో ఇరుక్కోవడంతో… ఆయన తప్పులకే ఆయనే శిక్ష అనుభవిస్తున్నారు అంటున్నారు. ప్రస్తుతానికి.. వంశీ ఓ కేసు తర్వాత మరో కేసులో జైలు జీవితం గడపడం తప్ప మరో మార్గం లేదంటున్నారు. అసలు హైకోర్టు నుంచి టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఊరట వచ్చే వరకు ఎదురు చూడడం, లేదా ఆ కేసునే ఎదుర్కోవటం చేస్తే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదంటున్నారు.

Also Read : TDP on Liquor Scam : రూ.3 వేల కోట్ల స్కామ్ – ఈ వైసీపీ నేతలే నిందితులు- అరెస్టు తప్పదా.?

చిన్న కేసులో ఉపశమనం కోసం ఏకంగా ఓ వ్యక్తినే కిడ్నాప్ చేసి కేసును ఉపసంహరణకు బలవంతంగా అఫిడవిట్ దాఖలు చేయడంతో… పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కేసు ఉపసంహరణతో ఇక తాను బయటపడ్డానని భావించిన వంశీకి.. ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు చేసినట్లుగానే దౌర్జన్యాలు చేస్తే చెల్లవు అంటూ రుజువు చేసింది.. కూటమి ప్రభుత్వం. బాధితుల్ని బలవంతంగా బెదిరించి కిడ్నాప్ చేశారంటూ ఆరోపణ మోపి జైల్లోకి నెట్టింది. ఈ కేసులో మరెంత కాలం కోర్టులు చుట్టూ తిరగాల్సి ఉంటుందో వేచి చూడాల్సిందే.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×