Prabhas New Movie : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగానే కాకుండా మోస్ట్ వాంటెడ్ హీరోగా కూడా పేరు సొంతం చేసుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ‘బాహుబలి’ సినిమా తర్వాత అమాంతం క్రేజ్ పెంచేసుకున్న ఈయన వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే బాహుబలి సీరీస్ తర్వాత వచ్చిన ‘సాహో’ ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. నిర్మాతలకు మాత్రం నష్టాలు రాలేదు. ఇక ఆ తర్వాత ‘ఆది పురుష్’ సినిమా చేయగా.. ఆ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. వాస్తవానికి ఈ సినిమాలు డిజాస్టర్ అవుతున్నా.. ఆయన కెరియర్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన ‘కల్కి 2898AD’ సినిమాతో మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు ప్రభాస్.
వరుస సినిమాలతో బిజీగా మారిన ప్రభాస్..
ఇక ప్రస్తుతం మారుతి (Maruti)దర్శకత్వంలో వస్తున్న ‘రాజా సాబ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈయన.. మరొకవైపు హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేయాల్సి ఉంది. కానీ అటు రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్ ల కారణంగా స్పిరిట్ సినిమాకి కరెక్ట్ డేట్స్ కేటాయించలేకపోతున్నారు ప్రభాస్. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కి సందీప్ రెడ్డివంగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అలా చేయకపోతే సినిమా చేయనంటూ ప్రభాస్ కి వార్నింగ్ ఇచ్చిన సందీ..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సందీప్ రెడ్డి వంగా గత యేడాది ‘యానిమల్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్పిరిట్ సినిమాకి ప్రభాస్ డేట్స్ ఇవ్వకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “ఈ సినిమా జూన్ లో స్టార్ట్ అవ్వకపోతే, స్పిరిట్ సినిమాను ఇంక నేను చెయ్యను. నీ శరీరాన్ని పెంచకు. 60 రోజులు ఏకధాటిగా నాకు సమయం కేటాయిస్తే.. సింగిల్ షెడ్యూల్ లోనే సినిమా పూర్తి చేసి ఇస్తాను. లేకపోతే లైట్ తీసుకో.. ఇక నేను నీతో సినిమా చెయ్యను అంటూ ప్రభాస్ కే సందీప్ రెడ్డివంగా వార్నింగ్ ఇచ్చారట. మరి సందీప్ రెడ్డి వంగా తో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఆయన తీసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, మొన్న వచ్చిన యానిమల్ అన్నీ కూడా వేటికవే ప్రత్యేక ఇమేజ్ ను దక్కించుకున్నాయి. అందుకే సందీప్, ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడని ప్రకటించినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ ప్రభాస్ మాత్రం తన సినిమా షూటింగ్లలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి డేట్ కేటాయించలేకపోతున్నారు. అందుకే సందీప్ రెడ్డివంగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ ఏ మేరకు తన సినిమా డేట్లను అడ్జస్ట్ చేసుకొని ఈ సినిమా కోసం 60 రోజులు కేటాయిస్తారేమో చూడాలి. మరి ఈ సినిమా కోసం 60 రోజులు కేటాయించినట్లయితే.. ఫౌజీ, రాజా సాబ్ సినిమాల విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.