Priya Vadlamani..శ్రీ హర్ష కొనుగంటి (Sri Harsha Konuganti) రచన , దర్శకత్వంలో 2018 డిసెంబర్ 14న విడుదలైన చిత్రం హుషారు(Husharu ). రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), దక్ష నగర్కర్ (Daksha Nagarkar), ప్రియా వడ్లమాని(Priya Vadlamani),హేమల్ ఇంగిల్ (Hemal ingel) , రమ్య పసుపులేటి (Ramya Pasupuleti), అభినవ్ మేడిశెట్టి (Abhinav Medi Shetty), తేజ్ కూరపాటి (Tej koorapati), తేజస్ కంచర్ల (Tejas kancharla), దినేష్ తేజ్ (Dinesh Tej) కాంబినేషన్లో కేవలం రూ.13 కోట్ల బడ్జెట్ తో వచ్చిన చిత్రం హుషారు. లక్కీ మీడియా, అసిన్ మూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో ‘ఉండిపోరాదే’ అనే పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ పాటలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది ప్రియా వడ్లమాని. సిద్ శ్రీరామ్ (Sid Shriram) ఆలపించిన ఈ పాటకు పలువురు సినీ సెలబ్రిటీలు సైతం పరవశించిపోయారు. ముఖ్యంగా అల్లు అర్జున్ (Allu Arjun) మొదలుకొని పలువురు స్టార్ హీరోలు సినిమాపై ప్రశంసలు కురిపించారు.
Thandel Movie Collections: తండేల్ కలెక్షన్స్ కు అడ్డుపడ్డ బన్నీ వాసు.. ఏమైందంటే..?
హుషారు మూవీలో అవకాశం అలా వచ్చింది..
ఈ సినిమాలో ప్రత్యేకించి ఈ పాటతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది ప్రముఖ హీరోయిన్ ప్రియా వడ్లమాని. ఇకపోతే ఈమెకు ఇది తొలి చిత్రం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా బ్రహ్మానందం (Brahmanandam), ఆయన పెద్ద కుమారుడు గౌతమ్ రాజా(Gautam Raja) కాంబినేషన్లో ఇటీవల విడుదలైన ‘ బ్రహ్మ ఆనందం’ సినిమాలో అవకాశాన్ని అందుకున్న ఈమె అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ‘హుషారు’ సినిమాలో తనకు వచ్చిన ఆఫర్ గురించి, తాను అనుకున్న విధానం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలో భాగంగా హుషారు సినిమా మీ ఫస్ట్ మూవీ కదా.. దీనికి మీకు ఎలా అవకాశం వచ్చింది? అని ప్రశ్నించగా.. ప్రియా మాట్లాడుతూ..”మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన నిర్మాత వాళ్ళు ఉండేవారు. మా ఇంట్లో మా పిన్ని పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి హడావిడిలో మేముండగా అక్కడి నుంచి.. ఇద్దరు అబ్బాయిలు నన్ను చూశారు. ఆ తర్వాత పెళ్లి ముగిసిన మరుసటి రోజు మా కజిన్స్ అంతా కలిసి గచ్చిబౌలిలో ఉండే ఒక డాబాకి బయలుదేరాము. అయితే బైక్ లో వెళ్లేటప్పుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నాను. సడన్గా ఇద్దరు అబ్బాయిలు వచ్చి మేము ఒక మూవీ చేస్తున్నాము. అందులో మీరు హీరోయిన్గా చేస్తారా అని అడిగారు. దాంతో నేను ఫ్రాంక్ అనుకోని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను.
30 సెకండ్లకే ఆడిషన్ పూర్తయింది..
ఆ సినిమా నిర్మాతతో ముందే నాకు పరిచయం ఉంది. ఒకసారి మీటింగ్ లో ఆయనను నేను కలిసినప్పుడు, ఆ అబ్బాయిలు మళ్లీ నన్ను చూసి.. సార్ మేము అడుగుతుంటే ఆ అమ్మాయి ఫ్రాంక్ అనుకుంటోంది. దయచేసి ఆమెకు చెప్పండి అని అడిగారు. దాంతో ఆయన వారు సినిమా తీస్తున్నారు ఆ సినిమాకు నేనే నిర్మాత ఒప్పుకో ప్రియ అన్నారు. అలా నేను సినిమాకి సైన్ చేశాను. అయితే నన్ను కలిసిన వారిలో ఒకరు డైరెక్టర్ హర్ష కూడా ఉన్నారు. ఇక తర్వాత ఆడిషన్స్ జరగగా.. ఒక రూమ్ లో కేవలం 30 సెకండ్లు మాత్రమే నన్ను ఇంటర్వ్యూ చేశారు
మధ్యలోనే ఆయన బయటకు వెళ్లిపోవడంతో ఇక నాకు అవకాశం రాదు అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే నే ఫోన్ చేసి ఇక షూటింగ్లో జాయిన్ కమ్మని చెప్పారు ” అంటూ ప్రియ చెప్పుకొచ్చింది మొత్తానికి అయితే తనకు హుషారు సినిమాలో మొదటి అవకాశం ఎలా వచ్చింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.