Thandel Movie Collections.. ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం తండేల్ (Thandel). ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సుమారుగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది . ఇదిలా ఉండగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు రోజుల్లోనే పైరసీ వెబ్సైట్లో రావడంతో.. వారిని బెదిరించడానికి.. ప్రెస్ మీట్ పెట్టారు అల్లు అరవింద్ (Allu Aravindh), బన్నీ వాసు(Bunny vasu). అయితే ఆ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ చేసిన కామెంట్లు మూవీ కలెక్షన్ల పై బాగా ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే విషయంపై బన్నీ వాసు మాట్లాడుతూ ఈ సినిమా పైరసీ విషయంలో పెట్టిన ప్రెస్ మీట్ వల్ల మూవీ కలెక్షన్ల పై ఎఫెక్ట్ బాగా పడింది అంటూ తెలిపారు.
ప్రెస్ మీట్ పెట్టడం వల్లే ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది- బన్నీ వాసు
ఇకపోతే ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే పలు పైరసీ వెబ్సైట్లో ఈ సినిమా హెచ్డి వెర్షన్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో చిత్ర బృందం వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తండేల్ సినిమాను పైరసీ చేస్తున్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సప్ గ్రూప్ , పైరసీ వెబ్సైట్ గ్రూపు అడ్మిన్ లకు ఇదే మా హెచ్చరిక అందరిపై కూడా కేసులు పెడుతున్నాం. మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది అంటూ చెప్పడం వల్లే ఇంకా ఎక్కువ నష్టపోయాం అంటూ బన్నీ వాసు తెలిపారు. ఇక ఇదే విషయంపై బన్నీ వాసు మాట్లాడుతూ..”తండేల్ హెచ్డి వెర్షన్ లో అందుబాటులోకి వచ్చిందని తెలియడంతో.. ఫైబర్ నేరగాళ్లకు వార్నింగ్ ఇవ్వాలని, మేము ప్రెస్ మీట్ పెట్టాము. కానీ ఆ ప్రెస్ మీట్ వల్ల మాకే నష్టం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టకు ముందు వరకు తండేల్ హెచ్డి ప్రింట్ లీక్ అయిందని ఎవరికీ తెలియదు. కానీ మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే ఇంకా ఎక్కువ ప్రచారం జరిగి , పైరసీ వెర్షన్ లో ఎక్కువమంది చూశారు అలా ప్రెస్ మీట్ పెట్టడం వల్లే మాకు నష్టం జరిగింది. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడింది. దానికి ఇప్పటికీ బాధపడుతున్నాము” అంటూ బన్నీ వాసు చెప్పుకొచ్చారు ఇక బన్నీ వాసు చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో ఓరల్ గా మారుతున్నాయి.
తండేల్ సినిమా విశేషాలు..
ఇక తండేల్ సినిమా విషయానికి వస్తే.. 2018లో శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొత్తానికైతే రియల్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో నాగచైతన్య తన పెర్ఫార్మన్స్ తో అందరినీ అబ్బురపరిచారు. ఇక మరొకసారి సాయి పల్లవి కూడా అందరిని ఆకట్టుకుంది. ఏది ఏమైనా భారీ సక్సెస్ కోసం ఎదురుచూసిన నాగచైతన్యకి సినిమా మంచి ఊరట కలిగించిందని చెప్పవచ్చు.