Mohammed Shami: టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో ఆడుతున్న షమీ విషయంలో ఓ వివాదం మొదలైంది. మహమ్మద్ షమీని లక్ష్యంగా చేసుకుని ఓ ముస్లిం మత గురువు తీవ్రంగా వ్యాఖ్యానించారు. పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ షమీ పాపం చేశాడని, అతడు ఓ నేరస్తుడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అసలు ఏం జరిగిందంటే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ విరామ సమయంలో మహమ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగడం పై అతివాద ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి. రంజాన్ మాసంలో రోజా పాటించకుండా షమీ పాపం చేశాడని జమాత్ సంస్థ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రిజ్వి ఆగ్రహం వ్యక్తం చేశాడు. రంజాన్ సందర్భంగా ప్రతి ముస్లిం యువకుడు, యువతి ఉపవాసం చేయాలని షరియత్ లో ఉందని.. ఎంతో ఆరోగ్యంగా ఉన్న షమీ మ్యాచ్ ఆడుతూ ఎనర్జీ డ్రింక్ తాగి పెద్ద పాపం చేశాడని ఆరోపించాడు.
ఈ పాపానికి షమీని అల్లా కఠినంగా శిక్షిస్తాడని హెచ్చరించాడు. ముస్లిం సమాజం రంజాన్ ఉపవాసం పాటిస్తున్న సమయంలో షమీ ఇలా చేయడం ఏంటని మండిపడుతూ ఓ వీడియోని విడుదల చేశాడు. “మహమ్మద్ షమీ మ్యాచ్ సమయంలో ఓ పానీయాన్ని సేవించారు. ప్రజలు వారి వైపు చూస్తూనే ఉన్నారు. మ్యాచ్ ఆడుతున్నాడు అంటే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. ఇలాంటి పరిస్థితులలో “రోజా” ని పాటించకుండా నీళ్లు తాగేశాడు. ఇది ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపుతుంది. రోజా ను పట్టించుకోకపోవడం నేరం. ఇలా చేయకూడదు.
షరియత్ దృష్టిలో అతడు నేరస్తుడు. అతడు దేవునికి సమాధానం చెప్పాలి” అని వ్యాఖ్యానించాడు. మరోవైపు ముస్లిం సంఘాలు చేసిన వ్యాఖ్యలపై షమీ కుటుంబ సభ్యులు స్పందించారు. భారత్ ఓటమిని కోరుకునే వాళ్లు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారని మండిపడ్డారు. ఇక ఈ మ్యాచ్ లో మొహమ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్ తో ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేశాడు. స్టార్ బ్యాటర్లను అవుట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
అయితే క్రీడాకారులు మైదానంలో ఆడుతున్న సమయంలో గ్లూకోజ్ వాటర్ వంటి పానీయాలను సేవిస్తారు. శరీరం అలసిపోకుండా ఉండేందుకు ఎనర్జీ కోసం ఇలా చేస్తారు. ఒకవేళ ఏదైనా ఆట ఆడుతున్న సమయంలో దాహం వేసినా ఎనర్జీ డ్రింక్ తాగకపోతే డిహైడ్రేషన్ కి గురై కళ్ళు తిరిగే అవకాశం ఉంది. ఈ కారణంగానే క్రీడాకారులు మైదానంలో కాస్త బ్రేక్ తీసుకుని డ్రింక్స్ తాగుతారు. అయితే ఇప్పుడు అలా చేసినందుకే షమీ చిక్కుల్లో పడ్డాడు.
షమీ డ్రింక్ తాగిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చిక్కుల్లో పడ్డాడు. అయితే షమీపై ఆ ముస్లిం జాతీయ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై షమీ అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మతాన్ని క్రీడలతో కలపకూడదని.. షమీ విజయాల పట్ల ముస్లిం సమాజం కూడా గర్విస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. షమీ చేసింది నేరమే కాదని.. దేశం ఎల్లప్పుడూ మతం కంటే పెద్దదని షమీకి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
🚨 Some people are abusing Shami for drinking energy drink during Match & not keeping roza
In the match against Australia, Mohammad Shami bowled brilliantly and took 3 wickets.
One Abubakar wrote, "If you are not fasting during Ramadan, then what sort of Muslim are you?"
One… pic.twitter.com/PKD3QvFzkN
— Times Algebra (@TimesAlgebraIND) March 6, 2025