BigTV English
Advertisement

35 Chinna Katha Kaadu: ప్రియదర్శి బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా రిలీజ్ డేట్ ఖరారు..

35 Chinna Katha Kaadu: ప్రియదర్శి బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా రిలీజ్ డేట్ ఖరారు..

35 Chinna Katha Kaadu New Release Date: కొన్ని సినిమాలు ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విధంగా ఫ్లాప్‌ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి సూపర్ డూపర్ రెస్పాన్స్‌ను అందుకుంటాయి. ఇప్పటికి చాలా సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ అయ్యాయి. చిన్న హీరోల సినిమాలు ఎక్కువగా హిట్లతో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా అద్భుతమైన హిట్‌ను కొట్టేందుకు సిద్ధమవుతోంది. అది మరేదో కాదు ‘35-చిన్న కథ కాదు’ సినిమా.


నివేదా థామస్, ప్రియదర్శి, భాగ్యరాజ్, విశ్వదేవ్, గౌతమి వంటి నటీనటులు ఇందులో ప్రధాన ప్రాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన యారబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి కలిసి నిర్మిస్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నాడు.

ఇందులో నివేధ థామస్ సరస్వతి పాత్రలో నటిస్తుంది. ఆమె ఇందులో సంప్రదయ చీరకట్టులో కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే పోస్టర్‌తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంది. గతంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా తన అందం, యాక్టింగ్‌తో అభిమాన ప్రేక్షకుల్ని అలరించిన ఈ నటి ఇప్పుడు సరికొత్త పాత్రలో కనిపించబోతుండటంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది.


Also Read: ఉపాధ్యాయుడి పాత్రలో ప్రియదర్శి.. మొండి గురువు చాణక్య గ్లింప్స్ అదుర్స్

అలాగే ప్రియదర్శికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసారు. ఇందులో అతడు ఎం.చాణక్య వర్మ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మేరకు అతడికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా అందరినీ అలరించాయి. అతడు ఈ మూవీలో గణిత ఉపాధ్యాయుడి పాత్రలో సినీ ప్రియుల్ని ఆకట్టుకోనున్నాడు. ఇలా ఈ మూవీలో ప్రధాన పాత్రలు చేస్తున్న వారి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసి మేకర్స్ మంచి అంచనాలు క్రియేట్ చేశారు. వీటికి తోడు ఇటీవల విడుదల చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్, ఇతర ప్రోమోలకు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కథాంశంతో రాబోతున్నట్టు ట్రైలర్ బట్టి.. ఈ సినిమా సరికొత్త కథాంశంతో వస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ వాయిదా వేశారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అదే రోజున టాలీవుడ్ నుంచి మూడు పెద్ద సినిమాలు.. ఇతర ఇండస్ట్రీ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు ఉండటంతో అంత పెద్ద సినిమాలతో పోటీ వద్దనుకుని రేస్ నుంచి తప్పుకున్నారు. ఇక కొత్త డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇవాళ నటుడు ప్రియదర్శి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను సెప్టెంబరు 6న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×