BigTV English

Priyanka Chopra: అమెరికా కోడలు.. బాబు కోసం ఇండియాలో ల్యాండ్ అయ్యిందయ్యా..

Priyanka Chopra: అమెరికా కోడలు.. బాబు కోసం ఇండియాలో ల్యాండ్ అయ్యిందయ్యా..

Priyanka Chopra:  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB29 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దర్శక ధీరుడు రాజమౌళి తన కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు.. ఎప్పుడెప్పుడు మహేష్ తో సినిమా చేస్తాడా.. ? అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసారు. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరుతుంది. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం తెల్సిందే.


మహేష్ లుక్ రివీల్ చేయకూడదు అనుకున్నారో.. లేక  ఓవర్ హైప్ వస్తుంది అనుకున్నారో.. పూజకు సంబంధించిన ఒక్క ఫోటోను కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్ నడుస్తోంది. SSMB29 కథ రాయడానికే రచయిత, జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ రెండేళ్లు పట్టిందని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ఇక స్క్రిప్ట్ వర్క్ కోసం జక్కన్న ఇన్నేళ్లు ఆగాడని, అంతా పక్కగా వచ్చాకనే షూటింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక జక్కన్న సినిమా అంటే  ఎలా ఉంటుంది అనే అనుమానం ఉండకపోయినా.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే అనుమానం మాత్రం రిలీజ్ అయ్యేవరకు ఉంటూనే ఉంటుంది. ఈ ఏడాది ఈ సినిమాను మొదలుపెట్టారు అంటే.. అది ఎన్నేళ్లకు పూర్తీ అవుతుంది అనేది జక్కన్నకు కూడా తెలియదు. ఇక ఈ సినిమా కోసం రాజాంమౌళి మంచి క్యాస్టింగ్ నే తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. SSMB29 లో మహేష్  సరసన అమెరికా కోడలు ప్రియాంక చోప్రా నటిస్తుందని వార్తలు వినిపించాయి.


Suma Kanakala: ఎర్ర కోక.. పచ్చ రైకా.. కట్టుకొచ్చిందిరో సుమక్క

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక.. నిక్ జోనాస్ ను వివాహమాడి అమెరికాలో సెటిల్ అయిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన దగ్గరనుంచి  హాలీవుడ్ మూవీస్ మీద ఎక్కువ ఫోకస్  పెట్టిన ప్రియాంక.. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాను ఒప్పుకుంది. రాజమౌళి సినిమా అంటే బాలీవుడ్ ఏంటి.. ఏ వుడ్ భామ అయినా ఒప్పుకోవాల్సిందే. అయితే ప్రియాంక ఇప్పటివరకు ఒకే ఒక్క తెలుగు హీరోతో నటించింది. అతనే రామ్ చరణ్. వీరి కాంబోలో తుపాకీ అనే సినిమా వచ్చింది. అయితే అది పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది.. మహేష్ సరసన నటిస్తుంది.

ఇక తాజాగా ఈ గ్లోబల్ బ్యూటీ.. SSMB29 షూటింగ్ కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఎయిర్ పోర్ట్ లో ప్రియాంక కనిపించగానే కెమెరామ్యాన్లు క్లిక్ మనిపించారు. రేపటి నుంచి ఆమె SSMB29 ప్రీ ప్రొడక్షన్ సెషన్ లో పాల్గొంటుందట. దీని తరువాత  SSMB29 సెట్ లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఇక ప్రియాంక తో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  మరి ఈ సినిమాతో జక్కన్న ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×