Smart Watch : ఒక స్మార్ట్ వాచ్ తన తండ్రి ప్రాణాలను కాపాడిందని… యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఆ వాచ్ లో ఉండే మెడికల్ అలర్ట్ వెంటనే హెచ్చరించడంతో అప్రమత్తమయ్యామని.. దీంతో ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు.
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. యాపిల్ వాచ్ ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని.. అలాగే తన తండ్రి ప్రాణాలను సైతం రక్షించిందని చెప్పుకొచ్చారు. యాపిల్ వాచ్‌లో ఉండే మెడికల్ అలర్ట్ ఫీచర్ తోనే ఇది సాధ్యమయ్యిందని తెలిపారు.
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కంపెనీలలో యాపిల్ ఒకటి. ఈ కంపెనీ ఇప్పటికే ఎన్నో స్మార్ట్ గ్యాడ్జెట్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాపిల్ కంపెనీ నుంచి వచ్చే మొబైల్స్ కు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మెుబైల్ కొనటం చాలా మంది కల కూడా. ఇక యాపిల్ తీసుకువచ్చే స్మార్ట్ వాచెస్ లో ఉండే ప్రీమియం ఫీచర్స్ ఎన్నో. ఈ వాచెస్ లో లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇప్పటికే ఎందరో ప్రాణాలను కాపాడినట్టు యాపిల్ కంపెనీ వెల్లడించింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన సీఈఓ టిమ్ కుక్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
తాజాగా ఓ ఇంటర్యూకు హాజరైన టిమ్ కుక్.. తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా రోజువారీ జీవితం, తనకు ఇష్టమైన ఆహారంతో తన రోజు ఎలా మెుదలవుతుందో చెప్పుకొచ్చారు. ఇంకా తనకు ఇష్టమైన వైన్ కూడా కోసం ఎన్నో విషయాలు తెలిపారు. ఆపై తాను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి నేడు ఈ స్థాయిలో ఉన్నానని.. అందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు.
ALSO READ : నథింగ్ ఫోన్ 2aపై దిమ్మ తిరిగే డీల్.. ఫ్లిప్కార్ట్ లో రూ. 20వేలలోపే!
ఇక యాపిల్ సంస్థ విషయానికి వస్తే.. ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీగా ఆపిల్ అవతరించడం ఎంతో సంతోషంగా ఉందని.. ఇంత పెద్ద సంస్థను నడిపించడం పెద్ద బాధ్యత అయినప్పటికీ ఎంతో ఇష్టంగా నిర్వర్తిస్తానని తెలిపారు. యాపిల్ కంపెనీ నుంచి వచ్చే ప్రతి గాడ్జెట్ యూజర్స్ కు ఎంతో ఉపయోగపడే విధంగానే ఉంటుందని చెప్పుకొచ్చిన టిమ్ కుక్… ఆపిల్ వాచ్ లో హెల్త్ బెనిఫిట్స్ కూడా తీసుకురావడానికి కారణం ఇదేనని తెలిపారు. అయితే ఈ స్మార్ట్ వాచ్ ఇప్పటికే ఎందరో ప్రాణాలను కాపాడిందని అందులో తన తండ్రి కూడా ఉన్నారని తెలిపారు
యాపిల్ వాచ్‌లో మెడికల్ అలర్ట్ ఫీచర్ ఉందని… ఇది ఒకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మా నాన్న ఒంటరిగా ఉంటున్నారు.. ఇలాంటి సమయంలోనే ఓ రోజు నేల మీద పడిపోయారు. వెంటనే ఆపిల్ వాచ్ నాకు నోటిఫికేషన్ పంపింది. ఈ సమాచారంతో వెంటనే ఇంటికి వెళ్లి చూస్తే తలుపులు వేసి ఉన్నాయని ఆపై తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. ఇలా ఆపిల్ వాచ్ తన ఇంట్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఉపయోగపడుతుందని చెప్పుకు వచ్చారు.