BigTV English

Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ మెడలో మెరిసిన నెక్లెస్ తో ఒక పాన్ ఇండియా మూవీ తీయొచ్చు.. తెలుసా.. ?

Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ మెడలో మెరిసిన నెక్లెస్ తో ఒక పాన్ ఇండియా మూవీ తీయొచ్చు.. తెలుసా.. ?
Advertisement

Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమెరికా కోడలుగా మారిన ప్రియాంకా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక ఈ మధ్యనే ప్రియాంక భర్త నిక్ కు ఒక అరుదైన వ్యాధి ఉందని తెలిసింది. ప్రస్తుతం భర్తను ఆమె ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందని సమాచారం. అందం లోనైనా, అభినయంలోనైనా, స్టేటస్ లోనైనా.. ఎలాంటి ఈవెంట్ లోనైనా.. ప్రియాంక స్టైల్ సపరేట్. ఏ ఈవెంట్ లోనైనా ఆమె హైలైట్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


ఇక తాజాగా ప్రియాంకా రోమ్ లో జరిగిన ఒక జ్యూవెలరీ ఈవెంట్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. బుల్గారి 140 వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో ప్రియాంకనే హైలైట్ గా నిలిచింది. తన షార్ట్ హెయిర్ కట్.. డ్రెస్, ఖరీదైన నెక్లెస్ తో చూపరులను ఎంతగానో ఆకర్షించింది. ప్రియాంక చోప్రా ఆఫ్-షోల్డర్ క్రీమ్ మరియు బ్లాక్ డ్రెస్‌లో ఫ్యాషన్ ఐకాన్ లా కనిపించింది. ఆ డ్రెస్ కు ఆమె హెయిర్ స్టైల్ మరింత లుక్ ను అందించింది. ఇ

క ప్రియాంక ధరించిన ఖరీదైన నెక్లెస్ ధర అక్షరాలా.. రూ. 358 కోట్లు అని తెలుస్తోంది. 140 క్యారెట్ల డైమండ్స్ తో దాదాపు 2,800 గంటలు ఎంతో శ్రమపడి ఖరీదైన నెక్లెస్ ను తయారు చేసినట్లు ఆమె తెలిపింది. ఇప్పటివరకు ఖరీదైన నెక్లెస్ వేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో ప్రియాంక కూడా చేరింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ రేటు విన్న అభిమానులు.. వామ్మో ఈ నెక్లెస్ ధరతో ఒక పాన్ ఇండియా సినిమా కూడా తీయొచ్చుగా అని కామెంట్స్ చేస్తున్నారు.


ఇకపోతే ప్రియాంక చోప్రా ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హెడ్స్ ఆఫ్ స్టేట్ షూటింగ్‌ను ముగించింది. ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా మరియు జాక్ క్వాయిడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఇది కాకుండా, ఆమె ఇటీవల ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ది బ్లఫ్‌లో కూడా నటిస్తున్నట్లు ప్రకటించింది.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×