BigTV English

OTT Movie : మనుషులను వెంటాడి చంపే జాంబి గొర్రెలు… పిచ్చెక్కించే జాంబీ మూవీ

OTT Movie : మనుషులను వెంటాడి చంపే జాంబి గొర్రెలు… పిచ్చెక్కించే జాంబీ మూవీ

OTT Movie : హాలీవుడ్ సినిమాలలో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందులోనూ కామెడీ కంటెంట్ తో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. గొర్రెల మీద ప్రయోగాలు చేయడంతో, అవి జాంబిలుగా మారి మనుషులపై దాడి చేస్తాయి. భయపెడుతూ ఎంటర్టైన్ చేసే ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? పేరు ఏమిటి వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘బ్లాక్ షీప్‘ (Black sheep). ఈ మూవీకి జోనాథన్ కింగ్ దర్శకత్వం వహించగా, ఫిలిప్పా కాంప్‌బెల్ నిర్మించారు. ఇందులో నాథన్ మీస్టర్, డేనియల్ మాసన్, పీటర్ ఫీనీ, టామీ డేవిస్, గ్లెనిస్ లెవెస్టమ్, టాండి రైట్, నటించారు. ఒక జన్యు పరమైన ప్రయోగం గొర్రెలను రక్తపిపాసి జాంబీలుగా మారుస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వీటినుంచి, తమను తాము రక్షించుకోవాల్సిన పరిస్తితి వస్తుంది. మార్చి 29, 2007న న్యూజిలాండ్‌లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హెన్రీ, అగస్టెన్ ఇద్దరు అన్నదమ్ములు గొర్రెలు కాచడంలో తండ్రికి సహాయం చేస్తూ ఉంటారు. అయితే హెన్రీ తండ్రికి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన అగస్టెన్ అతడు ప్రేమగా చూసుకునే గొర్రెను కిరాతకంగా చంపుతాడు. ఆ తర్వాత వీళ్ళ తండ్రి ఒక ప్రమాదంలో చనిపోతాడు. ఇటు గొర్రె, అటు తండ్రీ ఇద్దరు చనిపోవడంతో, హెన్రీ అక్కడ నుంచి దూరంగా వెళ్లి చదువుకుంటాడు. 15 సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు హెన్రీ. తనకు రావలసిన ఆస్తిని అమ్ముకొని బిజినెస్ చేయాలనుకుంటాడు. అయితే ఆ ప్రాంతంలో ఏవో ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయోగాలు గొర్రెల మీద చేస్తూ ఉంటారు. హీరోయిన్ అనిమల్ వైలెన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో గొర్రెల మీద ప్రయోగాలు జరుగుతున్నాయని తెలుసుకొని, రహస్యంగా అబ్జర్వ్ చేయడానికి వస్తుంది. అయితే తనతో పాటు వచ్చిన ఒక వ్యక్తి ఆ ల్యాబ్ నుంచి ఒక బాక్స్ ను దొంగలిస్తాడు.

అతడు బయటికి వచ్చినాక ఆ బాక్స్ పగిలిపోతుంది. అందులో నుంచి వచ్చిన ఒక చిన్న గొర్రె ఇతనిని గట్టిగా కొరుకుతుంది. అప్పటినుంచి అతను విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఆ చిన్న గొర్రె మిగతా గొర్రెలు కూడా కొరకడంతో వైరస్ గట్టిగా వ్యాపిస్తుంది. ఆ గొర్రెలు చాలా గట్టిగా, బలంగా తయారవుతాయి. ఆ గొర్రెలు అందులో ఉన్న వ్యక్తులను చంపడం మొదలుపెడతాయి. చివరికి ఆ వైరస్ కి విరుగుడు దొరుకుతుందా? గొర్రెల వల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయి? అక్కడ ఉన్నవాళ్ళు ప్రాణాలతో ఎలా బయటపడతారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బ్లాక్ షీప్’ (Black sheep) మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×