BigTV English

Priyanka Chopra : ప్రియాంకకు ఏకాంతంగా స్టోరీ నెరేషన్… డైరెక్టర్ నిర్వాకం బయట పెట్టిన గ్లోబల్ బ్యూటీ తల్లి

Priyanka Chopra : ప్రియాంకకు ఏకాంతంగా స్టోరీ నెరేషన్… డైరెక్టర్ నిర్వాకం బయట పెట్టిన గ్లోబల్ బ్యూటీ తల్లి

Priyanka Chopra : సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం అన్నది ఎంత రిస్క్ తో కూడుకున్న పని అనేది కొంతమంది హీరోయిన్లు చేసే షాకింగ్ కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. అయితే అదే తమ జీవితంలో అతిపెద్ద రిస్క్ అనుకుంటే, చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అవమానాలను, చేదు అనుభవాలను ఎదుర్కొని స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలగడం అంటే నిజంగా మామూలు విషయం కాదు. చాలామంది హీరోయిన్లు ఇలాంటి అవరోధాలు అన్నిటిని దాటుకొని, దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలారు. అయితే వీరంతా ఒక ఎత్తైతే, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) మరొక ఎత్తు. ఆమె బాలీవుడ్ లో దేశి గర్ల్ గా అదరగొట్టి, ఇప్పుడు హాలీవుడ్ లోనూ రాణిస్తోంది. ఇక రాజమౌళి ‘ఎస్ఎస్ఎంబి 29’ (SSMB 29) సినిమాతో పాన్ వరల్డ్ హీరోయిన్ గా దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తల్లి గతంలో తన కూతురికి ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. మరి ప్రియాంక చోప్రా తల్లి బయట పెట్టిన షాకింగ్ నిజం ఏంటి? ప్రియాంకను ఇబ్బంది పెట్టిన ఆ డైరెక్టర్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…


హీరోయిన్ కి ఏకాంతంగా స్టోరీ నెరేషన్

గ్లోబల్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా కెరియర్ తొలినాళ్ళలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లకి బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఎక్కడైనా సరే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎదురవుతుంది. అలాగే ప్రియాంక చోప్రా కెరీర్ స్టార్టింగ్ లో కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రా తల్లి బయట పెట్టడం సంచలనంగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తల్లి మాట్లాడుతూ “కెరీర్ స్టార్టింగ్ లోనే కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాను” అంటూ, ఓసారి సెట్స్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది. “సెట్లో నా కూతుర్ని కాపాడుకోవడానికి ఓ దయ్యంలా కూర్చునేదాన్ని. అలాంటి టైంలో ప్రియాంక చోప్రా కూడా మెచ్యూర్ గా బిహేవ్ చేసింది. మెంటల్ గా తాను స్ట్రాంగ్ గా ఉండేది. అందుకే కెరీర్ మొదట్లో ఎన్ని నెగిటివ్ సిచువేషన్స్ ఎదురైన ధైర్యంగా నిర్ణయం తీసుకుంది” అని అన్నారావిడ. అంతేకాకుండా అప్పట్లో ఓ డైరెక్టర్ ప్రియాంక చోప్రాకు కథ చెప్పడానికి వచ్చారట. ఆ టైంలో ఆమె తల్లిని క్యారవాన్ నుంచి బయటకు వెళ్ళమని, ఆమెకు ఏకాంతంగా నెరేషన్ ఇస్తానని చెప్పాడట.


ప్రియాంక షాకింగ్ సమాధానం

అలాంటి సిచువేషన్ లో ప్రియాంక చోప్రా ధైర్యంగా “నా తల్లి పక్కన ఉంటే కథ చెప్పలేకపోతే, ఆ సినిమాను ఎలా చేస్తానని అనుకుంటున్నారు?” అని డైరెక్టర్ ను ఘాటుగా ప్రశ్నించిందట. అంతేకాకుండా వెంటనే ఆ క్యారవాన్ నుంచి బయటకు వెళ్లిపోయిందట. అయితే ఆ డైరెక్టర్ పేరుని  మాత్రం ఆమె బయట పెట్టలేదు. ఇక ఇప్పటికే  ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమాలో నటిస్తున్న ప్రియాంక ఓ షెడ్యూల్ పూర్తి చేసింది. త్వరలోనే మరో షెడ్యూల్ కోసం ఆమె షూటింగ్లో జాయిన్ కాబోతోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×