Jr NTR New Movie..యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ).. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత జోరు పెంచిన విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో దేవర (Devara)సినిమా చేసి రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరో గా నటిస్తున్న ‘వార్ 2’ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ ఇప్పటికే వీరిద్దరి పై 500 మంది డాన్సర్లతో ఒక పాటను కూడా చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఇక మరొకవైపు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో #NTR 31 వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా కూడా ఇటీవల హైదరాబాద్లో దాదాపు 1500 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఘనంగా ప్రారంభం అయింది. ఇక ఈనెల ఆఖరిలోపు ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న పోతున్నట్లు సమాచారం.
నెల్సన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా అనౌన్స్మెంట్..
ఇలా వరుస సినిమాలు ఇంకా సెట్ మీద ఉండగానే.. అప్పుడే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ నెల్సన్(Nelson ) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ‘ROCK’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే మళ్లీ యాక్షన్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్. మరి ఏ మేరకు ఎన్టీఆర్కు ఈ చిత్రం కలిసి వస్తుందో చూడాలి.
ALSO READ:Tollywood: ప్రమోషన్స్ కోసం కొత్త స్ట్రాటజీ..!
నెల్సన్ కెరియర్..
నెల్సన్ దిలీప్ కుమార్ గా పేరు పొందిన ఈయన.. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నెల్సన్.. డాక్టర్, జైలర్, బీస్ట్ వంటి సినిమాలు చేసి సత్తా చాటారు. ప్రస్తుతం ‘జైలర్ 2’ సినిమా సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మరొకవైపు నిర్మాతగా ‘బ్లడీ బెగ్గర్’ అనే సినిమాని కూడా నిర్మించారు. ఇక ఇలా స్టార్ హీరోలను టార్గెట్ గా చేసుకొని, వారికి ఒక మంచి సక్సెస్ అందిస్తున్న ఈయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) తో ఒక ప్రాజెక్టు చేయబోతున్నారు. ఇకపోతే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. కానీ త్వరలోనే ఈ విషయం అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే 1984 జూన్ 21న జన్మించిన ఈయన 2010 లో ‘వెట్టై మన్నన్’ అనే సినిమాతో కెరియర్ ఆరంభించారు. ఇక 2018లో ‘కోలమావు కోకిల’ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.