Priyanka Jain : బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ (Priyanka Jain) బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలే. తాజాగా ఆమె ప్రియుడు ముద్దు పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూసినవారు “అలా ముద్దు పెట్టేసాడు ఏంటి!” అని ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంతకీ ఈ వీడియో దేనికి సంబంధించింది? అనే వివరాల్లోకి వెళ్తే…
ప్రియాంక జైన్ వెబ్ సిరీస్ టీజర్
సీరియల్స్ ద్వారా పరిచయమైన ఎంతోమంది నటీనటులు ప్రస్తుతం వెబ్ సిరీస్ ల వైపు దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ కూడా ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఆ వెబ్ సిరీస్ పేరు ‘ఎల్ఎల్ఎల్’ (LLL). జెడ్ ఫ్లిక్స్ (Z Flicks) ఒరిజినల్ సిరీస్ గా రూపొందుతున్న ఈ టీజర్ ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇందులో ప్రియాంక జైన్ , శివ మరిహళ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, సత్య కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కి శ్వేత కటకం నిర్మాతగా వ్యవహరించారు. ఆనంద్ గుర్రాన మ్యూజిక్ అందించారు. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో ప్రియాంక జైన్ స్టైలిష్ లుక్ లో ఓ రెస్టారెంట్లో తన ప్రియుడిని కలిసింది. అతను “హాయ్” అని పలకరించగానే… “నీకు 10 మినిట్స్ టైం ఉంది… అది ఇప్పటితో స్టార్ట్” అని చెప్పింది.
పర్మిషన్ లేకుండానే ముద్దు…
కానీ హీరో మాత్రం ఆలోచిస్తూ కూర్చున్నాడు. “లాస్ట్ వన్ మినిట్ మాత్రమే ఉంది” అని ప్రియాంక గుర్తు చేయగా… సడన్ గా హీరో గేరు మార్చి “డియర్ బాయ్స్ ఒక అమ్మాయి మనమంటే ఇష్టమని చెప్పేసింది. కానీ తనకి మనం కరెక్టా కాదా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉంది. తనను కన్విన్స్ చేయడానికి మన దగ్గర పాయింట్స్ ఏమీ లేనప్పుడు. అసలు ఏం మాట్లాడాలో తెలియకుండా బుర్ర బ్లాంక్ అయిపోయినప్పుడు… ఇంక ఏ దిక్కు తోచనప్పుడు… టైం అయిపోతుంది అనే టెన్షన్ పడకుండా… గట్టిగా బ్రీత్ తీసుకుని… తన కళ్ళలోకి చూస్తూ, దేవుడి మీద భారం వేసి ఇలా… ” అంటూ వెళ్లి ఠక్కున ముద్దు పెట్టేసాడు. ఆ తర్వాత ప్రియాంక సిగ్గుపడుతూ కనిపించింది. కేవలం 1 నిమిషం 47 సెకండ్లు నిడివి ఉన్న ఈ టీజర్ యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉంది.
ఇక ప్రియాంక జైన్ విషయానికి వస్తే… ఆమె రియల్ లైఫ్ లో తన సహనటుడు, ప్రియుడు శివకుమార్ తో కలిసి తరచూ ప్రాంక్ వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడుతుంది. ఇలాంటి వీడియోల వల్ల పలు సార్లు వివాదాలలో కూడా చిక్కుకుంది. అంతకంటే ముందు ప్రియాంక జైన్ జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్ తో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అడుగు పెట్టి, తన ఆట తీరుతో అందరిని మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.