BigTV English

US Visa Drop Box Rules : అమెరికా వీసా రూల్స్‌లో మార్పులు.. కఠినతరం చేసిన ట్రంప్ ప్రభుత్వం!

US Visa Drop Box Rules : అమెరికా వీసా రూల్స్‌లో మార్పులు.. కఠినతరం చేసిన ట్రంప్ ప్రభుత్వం!

US Visa Drop Box Rules | అమెరికా వీసా రెనూవల్‌ చేయాలనుకునే వారికి షాక్! వీసాల పునరుద్ధరణ కోసం తీసుకువచ్చిన ‘డ్రాప్‌బాక్స్‌’ నిబంధనలను అమెరికా కఠినతరం చేసింది. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు ముగిసిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెనూవల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. తాజా నిబంధనలను తక్షణమే అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


అధికారికంగా ఈ నిబంధనలను ప్రకటించకపోయినా, వాటిని వెంటనే అమలులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీసా రెనూవల్‌కు సంబంధించిన కొత్త నిబంధనలను ఇప్పటికే వీసా అప్లికేషన్‌ కేంద్రాల్లో అమలు చేస్తున్నట్లు సమాచారం వస్తోంది. తాజాగా తీసుకువచ్చిన నియమాలతో హెచ్‌-1బీ వీసాలతోపాటు బీ1, బీ2 వంటి నాన్‌ఇమిగ్రెంట్‌ వీసాదారుల అప్లికేషన్లపైనా తీవ్ర ప్రభావం పడనున్నట్లు సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. ఇలాంటి వీసాదారులు తమ వీసాలను రెనూవల్‌ చేసుకోవడానికి ఇప్పుడు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటివరకు అమలులో ఉన్న నిబంధనలు
ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం, గత 48 నెలల్లో వీసా గడువు ముగిసినవారు రెనూవల్‌ కోసం డ్రాప్‌బాక్స్‌ విధానంలో దరఖాస్తు చేసుకునేవారు. అలాంటివారికి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండేది కాదు. ఇప్పుడు ఈ నిబంధనను మార్చి, గత 12 నెలల్లో వీసా గడువు ముగిసినవారికి మాత్రమే డ్రాప్‌బాక్స్‌లో రెనూవల్‌ చేసేందుకు అనుమతి ఇస్తున్నారు. అంటే ప్రస్తుతం వీసా గడువు తీరి సంవత్సరం దాటినవారు రెనూవల్‌ కోసం మళ్లీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందే!


Also Read: వారానికి 70 గంటలు పనిచేసిన ఐటి ఉద్యోగి.. విడాకులు కావాలంటున్న భార్య!

కొవిడ్‌ ముందు పాత నియమాలు
కరోనా ముందు వరకు ఇంటర్వ్యూ లేకుండా వీసా పునరుద్ధరణ కోసం ఈ 12 నెలల నిబంధనే అమలులో ఉండేది. ఆ తర్వాత వీసా మంజూరు, రెనూవల్‌కు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 2022లో ఈ ‘డ్రాప్‌బాక్స్‌’ విధానాన్ని తీసుకువచ్చారు. అప్పటినుంచి గత 48 నెలల్లో గడువు పూర్తయిన వారు కూడా ఇంటర్వ్యూ లేకుండా రెనూవల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు ట్రంప్‌ ప్రభుత్వం దీన్ని మళ్లీ పాత పద్ధతిని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

భారతీయులపైనే ఎక్కువ ప్రభావం
వీసాల పునరుద్ధరణ కోసం తీసుకువచ్చిన ‘డ్రాప్‌బాక్స్‌’ నిబంధనల మార్పులతో భారతీయ దరఖాస్తుదారులకు వీసా రెనూవల్‌ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే దిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో బీ1/బీ2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ల కోసం 440 రోజులకు పైగా వేచి ఉంటున్నారు. ఇప్పుడు మరింత ఎక్కువమంది ఇంటర్వ్యూలకు వస్తే ఈ వీసాల జారీ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. డ్రాప్‌బాక్స్‌పై ఆధారపడుతున్న బిజినెస్‌ ట్రావెలర్స్‌, వృత్తినిపుణులు వీసాల (హెచ్‌-1బీ) పునరుద్ధరణకు ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ముఖ్య అంశాలు
కొత్త నిబంధన: గత 12 నెలల్లో వీసా గడువు ముగిసినవారికి మాత్రమే డ్రాప్‌బాక్స్‌లో రెనూవల్‌ చేసే అవకాశం.

పాత నియమాలు: కొవిడ్‌ ముందు ఈ 12 నెలల నిబంధనే అమలులో ఉండేది. 2022లో 48 నెలలకు విస్తరించారు.

భారతీయులపై ప్రభావం: ఇప్పటికే ఇంటర్వ్యూ స్లాట్ల కోసం 440 రోజులు వేచి ఉండేవారు. ఇప్పుడు ఇంకా ఆలస్యం అవుతుంది.

బిజినెస్‌ ట్రావెలర్స్‌ మరియు వృత్తినిపుణులు: ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ మార్పుల వల్ల అమెరికా వీసా రెనూవల్‌ ప్రక్రియ మరింత కష్టతరమైంది. ఇది ప్రత్యేకించి భారతీయులకు ఎక్కువ సమస్యలను సృష్టిస్తుంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×