Ram Charan : స్టార్ హీరోలు ఎంతో లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తారో మనకు తెలిసిందే. వాళ్ళు కాళ్లకు వేసుకునే చెప్పులు మొదలుకొని.. ఒంటి మీద వేసుకునే డ్రెస్సులు, చేతికి పెట్టుకునే వాచ్ లు ఇలా తమకు సంబంధించినవి ప్రతి వస్తువు కూడా చాలా లగ్జరీగా ఉండేటట్లు చూసుకుంటారు.ఎంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తే ఇండస్ట్రీలో అంత గుర్తింపు అనుకుంటారో ఏమో తెలియదు కానీ చాలామంది సెలబ్రిటీలు రిచ్ లైఫ్ ని మెయింటైన్ చేస్తారు.అయితే అలాంటి వారిలో గోల్డెన్ స్పూన్ తో పుట్టిన చిరంజీవి (Chiranjeevi) కొడుకు రామ్ చరణ్ కూడా అంతే రిచ్ లైఫ్ ని మెయింటైన్ చేస్తారు. రామ్ చరణ్ వేసుకునే షూస్ దగ్గరి నుంచి ఆయన చేతికి పెట్టుకునే వాచ్,ఒంటి మీద వేసుకునే డ్రెస్సులు ఇలా ప్రతి ఒక్కటి చాలా కాస్ట్లీ గానే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా రామ్ చరణ్ (Ram Charan) ధరించిన వాచ్ గురించి నెట్టింట తెగ రచ్చ జరుగుతోంది.
ఆశ్చర్యపరుస్తున్న రామ్ చరణ్ వాచ్ ఖరీదు..
ఎందుకంటే రామ్ చరణ్ తన చేతికి ఏకంగా కోట్లు విలువచేసే వాచ్ ని పెట్టుకున్నారు.ఇక ఈ వాచ్ ధర తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వడం పక్కా.ఎందుకంటే ఆ వాచ్ ధరతో ఏకంగా ఓ ఫ్లాట్ నే కొనేయచ్చు. మరి ఇంతకీ రామ్ చరణ్ (Ram Charan) చేతికి ఉన్న ఆ వాచ్ ధర ఎంతో ఎప్పుడు చూసేద్దామా.. సెలబ్రిటీలు చాలామంది లగ్జరీ వాచ్ లను పెట్టుకుంటూ ఉంటారు. అలా ఇప్పటికే ఎన్టీఆర్ (NTR) , చిరంజీవి(Chiranjeevi) , సల్మాన్ ఖాన్ (Salman Khan),షారుక్ ఖాన్ (Shahrukh Khan) వంటి ఎంతోమంది హీరోలు తమ చేతికి లగ్జరీ వాచ్ లు పెట్టుకుని వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్ కూడా ఓ వెకేషన్ కి వెళ్తూ.. ఆ వెకేషన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా తన చేతికి ధరించిన గడియారంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ వాచ్ ధర అక్షరాల రూ. 2 కోట్లు. ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వాచ్ ప్రత్యేకతలు ఇవే..
ఇక ఆ వాచ్ వివరాలు ఏంటంటే..? రామ్ చరణ్ తాజాగా తన చేతికి రోలేక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ డే-డేట్ 36 అనే లగ్జరీ కంపెనీకి చెందిన ఖరీదైన వాచ్ ని పెట్టుకున్నారు. ఇక ఈ లగ్జరీ వాచ్ ధర మన ఇండియన్ హోరాలజీ ప్రకారం..దాదాపు రూ. 2.19 కోట్లు ఉంటుందని అంచనా.. అంతేకాదు ఈ వాచ్ ఒక ప్రత్యేకమైన టైం పీస్ అని తెలుస్తోంది. అలాగే క్లిష్టమైన జిగ్సా పజిల్ ప్రేరేపిత డిజైన్ కలిగి ఉన్న ఈ వాచ్ పింక్, వైట్, ఎల్లో కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇక రామ్ చరణ్ (Ram Charan) ఎప్పుడైతే తన చేతికి ఈ లగ్జరీ వాచ్ ని ధరించారో అప్పటినుండి ఈ వాచ్ ధర ఎంత ఉంటుందోనని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. అలా ఈ వాచ్ ధర రూ. 2.19 కోట్లు అని తెలియడంతోనే చాలామంది జనాలు ఈ 2 కోట్లతో హైదరాబాదులో ఓ లగ్జరీ ఫ్లాట్ కొనేయొచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer) భారీ డిజాస్టర్ అయింది. ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ RC16 పై ఫోకస్ పెట్టారు రామ్ చరణ్.