BigTV English

Priyanka Mohan: ‘ఓజీ’ సినిమాపై ప్రియాంక మోహన్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే.!

Priyanka Mohan: ‘ఓజీ’ సినిమాపై ప్రియాంక మోహన్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే.!

Priyanka Mohan: చాలామంది సినీ సెలబ్రిటీలు.. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాలని, అక్కడ కూడా తమ సత్తా చాటాలని అనుకుంటూ ఉంటారు. కానీ రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ కాలేక తిరిగి సినిమాల్లోకి వచ్చిన వారే ఎక్కువ. పవన్ కళ్యాణ్ కూడా మొదట్లో అలాగే చేశారు. రెండో ప్రయత్నంలో పవన్‌కు పాలిటిక్స్‌లో మంచి సక్సెస్ అందుకుంది. అందుకే తన అప్‌కమింగ్ సినిమాల విషయంలో సతమతం మొదలయ్యింది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌ను చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయినా.. తనను వెండితెరపై చూడాలని కూడా ఎదురుచూస్తున్నారు. అన్నింటికంటే ఎక్కువగా ‘ఓజీ’ కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి హీరోయిన్ ప్రియాంక మోహన్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది.


పాలిటిక్స్‌లోనే బిజీ

పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా హీరోగా నటిస్తున్న సినిమాలు అన్నీ సోషల్ మెసేజ్‌తోనే ఉంటున్నాయి. అవి ఫ్యాన్స్‌కు నచ్చి హిట్ చేస్తున్నా కూడా తన నుండి ఒక మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను కోరుకుంటున్నారు అభిమానులు. అలా ఎవరూ ఊహించని విధంగా సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ మూవీని ఓకే చేశాడు పవన్. పవన్ కళ్యాణ్, సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో సినిమా అనగానే తమకు నచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. అందులో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్, విలన్‌గా బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ అని చెప్పగానే క్యాస్టింగ్ కూడా అంతా ఓకే అనుకున్నారు. ఇంతలోనే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు.


ఇంకా కొన్నిరోజులే

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా ఉండకముందు ‘ఓజీ’ షూటింగ్ రెగ్యులర్‌గా జరిగింది. అలా సగం షూటింగ్ వేగంగా పూర్తయ్యింది కూడా. అంతలోనే పవన్ సినిమాలకి బ్రేక్ ఇచ్చేశాడు. దీంతో మిగతా యాక్టర్స్‌తో షూటింగ్‌ను పూర్తిచేశాడు సుజీత్. తాజాగా ఈ మూవీ కోసం తన పొలిటికల్ షెడ్యూల్ నుండి కాస్త బ్రేక్ తీసుకొని ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఒక అవార్డ్ ఫంక్షన్‌లో పాల్గొన్న ప్రియాంక మోహన్..‘ఓజీ’ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ అందించి ఫ్యాన్స్‌లో కాస్త ఎగ్జైట్మెంట్ పెంచేసింది. షూటింగ్‌కు ఇంకా కొన్నిరోజులే మిగిలిందని బయటపెట్టింది ప్రియాంక మోహన్.

Also Read: మరో ఐటెంసాంగ్ లో బుట్టబొమ్మ.. ఈసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్.. ?

గర్వించదగ్గ విషయం

‘‘పవన్ కళ్యాణ్‌తో పనిచేయడం నా కల. ఇంకా షూటింగ్‌కు కొన్నిరోజులే మిగిలింది. ఇది నాకు చాలా గర్వించదగ్గ మూమెంట్. అలాంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషం’’ అని చెప్పుకొచ్చింది ప్రియాంక మోహన్ (Priyanka Mohan). దీంతో షూటింగ్‌కు ఇంకా కొన్నిరోజులే మిగిలుంది అనడంతో ఫ్యాన్స్‌లో కూడా మళ్లీ ‘ఓజీ’పై ఆశలు మొదలయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ మూవీ విడుదల కావాల్సింది. కానీ అప్పటికి ఇంకా షూటింగే పూర్తి కాలేదు. దీంతో ఈ ఏడాది సమ్మర్‌లో మూవీ రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు భావించారు. ఇప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఇక ఈ సమ్మర్‌లో కూడా ‘ఓజీ’ (OG) విడుదల లేనట్టే అని ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×