BigTV English

Kanguva 2: పార్ట్ 1కే కంగుతిన్నామని అనకండి.. ఇట్స్ సీరియస్.. ‘కంగువా 2’ వచ్చేస్తుంది

Kanguva 2: పార్ట్ 1కే కంగుతిన్నామని అనకండి.. ఇట్స్ సీరియస్.. ‘కంగువా 2’ వచ్చేస్తుంది

Kanguva 2 Confirmed: చాలాకాలం నుండి కోలీవుడ్ మేకర్స్ ఒక పర్ఫెక్ట్ ప్యాన్ ఇండియా సినిమాను తెరకెక్కించడం కోసం కష్టపడుతున్నారు. టాలీవుడ్ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయడమే తమిళ దర్శక నిర్మాతల టార్గెట్‌గా మారిపోయింది. అయినా ఇన్నేళ్లల్లో కోలీవుడ్ నుండి ఎన్నో ప్యాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. కానీ అందులో ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. తాజాగా విడుదలయిన ‘కంగువా’ కూడా దాదాపుగా అదే కేటగిరిలో యాడ్ అయ్యిందని ప్రేక్షకుల రివ్యూలు చూస్తుంటే తెలుస్తోంది. ‘కంగువా’నే ఆదరించని ప్రేక్షకుల ముందుకు దాని సీక్వెల్‌ను తీసుకొస్తానని నిర్మాత జ్ఞానవేల్ రాజా (Gnanavel Raja) క్లారిటీ ఇచ్చారు.


సూర్య కష్టం..

హీరో సూర్య గత రెండేళ్లుగా వెండితెరపై కనిపించలేదు. తన గత సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. తనకు ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల సూర్య సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు వస్తున్నారు. కానీ కమర్షియల్‌గా సూర్య సక్సెస్‌ను చూసి చాలాకాలం అయ్యింది. ఇలాంటి సమయంలో ప్యాన్ ఇండియా మూవీ అంటూ, హై బడ్జెట్ సినిమా అంటూ ‘కంగువా’తో భారీ రిస్క్ చేశాడు సూర్య. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కోసం పూర్తిగా తన అవతారాన్నే మార్చేశాడు. ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. అయినా మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పార్ట్ 1 మెప్పించలేకపోతే ఏంటి పార్ట్ 2తో వస్తామని నిర్మాత జ్ఞానవేల్ రాజా స్పష్టం చేశారు.


Also Read: 1000 కోట్లకు ఎంత తక్కువ ఉందంటే…? మీరు అస్సలు ఊహించరు

ఆ సినిమా అయిపోగానే..

‘కంగువా’ విడుదల తర్వాత పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నిర్మాత జ్ఞానవేల్. అందులో ఒక ఇంటర్వ్యూలో ‘కంగువా 2’పై క్లారిటీ ఇచ్చారు. పార్ట్ 2కు టైమ్ తీసుకుంటారా లేదా వెంటనే ప్రారంభిస్తారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘దర్శకుడు శివకు తర్వాత ఉన్న కమిట్మెంట్స్ గురించి అందరికీ తెలుసు. మధ్యలో ఆయన అజిత్ సార్‌తో సినిమా చేయాలి. అది అయిన తర్వాత కంగువా 2ను ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. దీంతో నిర్మాతకు ఇంకా ‘కంగువా’కు వచ్చిన టాక్ అర్థం కాలేదా, మళ్లీ సీక్వెల్‌తో ఎందుకు రిస్క్ తీసుకోవాలని అనుకుంటున్నాడు అని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

నిర్మాత నమ్మకం..

‘కంగువా’ (Kanguva) కోసం సూర్య (Suriya) చాలానే కష్టపడ్డాడు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో సౌత్, నార్త్ తేడా లేకుండా అన్ని చోట్లా ప్రమోషన్స్ చేశాడు. నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా ఈ సినిమా కోసం భారీగా పెట్టుబడి పెట్టాడు కాబట్టి ‘కంగువా’పై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. కొన్ని తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాల ఉదాహరణను తీసుకొని వాటికి హిందీ రైట్స్ కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని, కానీ ‘కంగువా’ హిందీ శాటిలైట్ రైట్స్ కోసం సంస్థలు ఎగబడుతున్నాయని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అంతే కాకుండా ‘కంగువా’ పక్కా హిట్ అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. మూవీ విడుదలయ్యి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా సీక్వెల్ చేస్తానని అనడమేంటి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×