Kubera Glimpse: అక్కినేని నాగార్జున.. ఆయన రేంజ్ కు, స్టార్ డమ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. అలాంటి హీరో.. మరో హీరో సినిమాలో ఒక కీలక పాత్రలో చేస్తున్నాడు అంటే.. ఆ సినిమా ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెల్సిందే. హీరోగా కాకుండా ఒక సపోర్టివ్ రోల్ లో నాగ్ నటిస్తున్న చిత్రం కుబేర. క్లాసిక్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బిచ్చగాడిలా ధనుష్ కనిపించడం, ఐటీ అధికారిగా నాగ్ కనిపించడం.. డబ్బు సూట్ కేస్ తో రష్మిక కనిపించడం.. ఇలా ప్రతి పోస్టర్ కూడా ఈ సినిమాపై అంచనాలను రెండింతలు రెట్టింపును చేస్తూనే వచ్చాయి.
Bhairavam: ఒక తమిళ్ అందం.. ఒక తెలుగందం.. అదిరిందయ్యా భైరవం
తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఒక్క డైలాగ్ లేకపోయినా వారి ఎమోషన్స్ తెలిసేలా కట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ధనుష్.. బిచ్చగాడిలానే కనిపించాడు. నాగ్ కుటుంబంతో హ్యాపీగా ఉండడం, బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ విలన్ గా కనిపించాడు. ఆయన విదేశాల నుంచి రావడం.. నాగ్ భయపడడం.. రష్మిక దేనికోసం వెతకడం ఇలా ఒక్కో ఫ్రేమ్ లో ఒక్కో ఎమోషన్ ను చూపించాడు. అసలు కథను రివీల్ చేయకుండా శేఖర్ చాలా జాగ్రత్తపడ్డాడు.
Unstoppable With NBK: ఒక్కసారైనా ఎన్టీఆర్ గురించి అడగాలనిపించలేదా బాలయ్య.. ?
ఇక చివర్లో వైట్ అండ్ వైట్ పంచెలో ధనుష్.. దేవుడికి దండం పెట్టడంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. గ్లింప్స్ మొత్తంలో నాగ్ మావనే హైలైట్ గా నిలిచాడు. ఇక వీడియో అంతా ఒక ఎత్తు అయితే.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో ఎత్తు అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.